IND VS RSA :
దక్షిణాఫ్రికా తో జరుగుతున్న నాలుగో టి20 మ్యాచ్ లో భారత్ అదరగొడుతుంది.
సంజు సాంసంగ్ మరియు తిలక్ వర్మ సెంచరీలతో చెలరేగిపోయారు…
వీళ్ళిద్దరూ సౌత్ ఆఫ్రికా బౌలింగ్లో ఉతికి పారేశారు. డ్యూయల్ సెంచరీలతో రికార్డు సృష్టించారు.
మన తెలుగు ఆటగాడు అయినటువంటి తిలక్ వర్మ గత బుధవారం జరిగిన మూడో టి20 మ్యాచ్ లో సెంచరీ తో నాటౌట్ గా నిలిచాడు.
నిన్న జరిగినటువంటి నాలుగో టి20 మ్యాచ్ లో మరోసారి సెంచరీ తో నాట్ అవుట్ గా నిలిచి తెలుగువాడి సత్తా చాటుకున్నాడు.
తిలక్ తన 2వ T20I సెంచరీ కోసం 41 బంతులు తీసుకున్నాడు. తిలక్ వర్మ 47 బంతుల్లో 120* పరుగులు చేశాడు.
సంజూ శాంసన్ ఈ మ్యాచ్ లో 56 బంతుల్లో 109* పరుగులు చేశాడు. ఈ సెంచరీతో వరుసగా రెండు సెంచరీలు బాదిన ప్లేయర్ గా కూడా తిలక్ వర్మ ఘనత సాధించాడు.
టీ20 క్రికెట్ లో వరుసగా రెండు సెంచరీలు సాధించిన భారత ప్లేయర్లు ఇద్దరు ఉన్నారు వారే నేడు సెంచరీలు కొట్టిన సంజూ శాంసన్, తిలక్ వర్మ.
సంజు పిల్లలమర్రి
Also Read This : అమెజాన్ ప్రైమ్ వీడియో లో రానా కొత్త షో