Good Bad Ugly: ఈ సినిమా రెండు గంటల రోలర్ కోస్టర్ రైడ్

మైత్రి మూవీ మేకర్స్, అజిత్ కుమార్‌ కాంబోలో వచ్చిన చిత్రం ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఏప్రిల్ 10న విడుదలై అన్ని వర్గాల ప్రేక్షకులని అలరిస్తోంది. ఈ సందర్భంగా మేకర్స్ సంభవం సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిర్మాత నవీన్‌ యర్నేని మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమా ఒక మంచి ఎక్స్పీరియన్స్. మా హీరో అజిత్ గారి వలన సినిమా మంచి సక్సెస్ సాధించింది. డైరెక్టర్ అధిక్ అద్భుతమైన సినిమా ఇచ్చాడు. అజిత్ గారు చాలా సింపుల్ పర్సనే కాకుండా మనసుతో మాట్లాడే మనిషి. ఈ సినిమాని కేవలం 95 రోజుల్లో అధిక్ పూర్తి చేశాడు. ఇంత గ్రాండ్ స్కేల్ ఉన్న సినిమాని 95 డేస్ లో కంప్లీట్ చేయడం మామూలు విషయం కాదు. ఈ సినిమా రెండు గంటల రోలర్ కోస్టర్ రైడ్’’ అన్నారు.

డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్ మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమాకి మ్యూజిక్ స్ట్రాంగ్ పిల్లర్. జీవి ప్రకాష్ అద్భుతమైన మ్యూజిక్ ఇవ్వగా.. ప్రియా క్యారెక్టర్ ప్రేక్షకులను అలరించింది. కార్తికేయ, సునీల్ క్యారెక్టర్స్ చాలా బాగా చేశారు. మైత్రి మూవీ మేకర్స్ తమిళనాడులో హిస్టరీ క్రియేట్ చేశారు’’ అని తెలిపారు. నటుడు సునీల్ మాట్లాడుతూ.. ‘‘నాకు తమిళ్‌ సినిమా మార్క్ ఆంటోనీలో ఛాన్స్ ఇచ్చిన డైరెక్టర్ అధిక్ గారికి థాంక్స్ చెప్పాలి. ఆయన ఏం చెప్తే అది చేశాను. అజిత్ గారి సినిమాలన్నిటికీ సీక్వెల్ లా ఉంటుంది. గబ్బర్ సింగ్ సినిమా చూసి పవన్ కళ్యాణ్ అభిమానులు ఏరకంగా పూనకాల్లోకి వెళ్లిపోయారో.. ఈరోజు అజిత్ ఫ్యాన్స్ కూడా ఈ సినిమాను చూసి అంతా ఎంజాయ్ చేస్తున్నారు’’ అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రియా ప్రకాశ్ వారియర్, మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాశ్ పాల్గొన్నారు.

ప్రజావాణి చీదిరాల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *