అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం ‘పరదా’. ఆనంద మీడియా బ్యానర్‌పై శ్రీనివాసులు పివి, శ్రీధర్ మక్కువతో కలిసి విజయ్ డొంకడ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దర్శన రాజేంద్రన్‌తో పాటు, సంగీత ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రాగ్ మయూర్ కూడా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ డేట్‌ను నేడు (గురువారం) ప్రకటించారు. ఈ సినిమా ఆగస్టు 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్మీట్లో ఒక పాటతో పాటు మూవీ రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు, హీరో సత్యదేవ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ప్రెస్ మీట్లో హీరో సత్యదేవ్ మాట్లాడుతూ.. ‘‘ఆగస్టు 22న ఈ సినిమా వస్తుంది. చాలా అద్భుతమైన డేట్ అది. కచ్చితంగా సినిమా మంచి విజయాన్ని సాధిస్తుంది. సురేష్ బాబు గారు మంచి సినిమాని ఎప్పుడు సపోర్ట్ చేస్తారు. ఈ సినిమా నిర్మాతలతో నేను ఇంతకుముందు ఒక సినిమా చేశాను’’ అన్నారు. ప్రొడ్యూసర్ సురేష్ బాబు మాట్లాడుతూ… ‘‘మనం జీవితంలో ముందువెళ్తున్న కొద్ది భయం మోటివేషన్ అనే రెండు ఫ్యాక్టర్స్ ఉంటాయి. విజయ్ తీస్తున్నప్పుడు ఎందుకంత రిస్క్ చేస్తున్నారు అనే భయం ఉండేది. ఈ సినిమా ట్రైలర్ చూపించాడు. షాక్ అయ్యాను. అంత అద్భుతంగా తీశారు. తర్వాత సినిమా చూస్తానని చెప్పా.ను సినిమా చూశాను. చాలా అద్భుతంగా ఉంది. చాలా ప్యాషన్ తో ఈ సినిమా చేశారు. ఒక కొత్త రకమైన కథ చెప్పాలి అనే తపన కనిపించింది. ఇలాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు. చాలా ఎక్స్పెన్సివ్ సినిమా ఇది’’ అన్నారు.
హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ మాట్లాడుతూ.. ‘‘ఇది చిన్న సినిమా అంటున్నారని ఈ సినిమా ద్వారా మేము చెప్పదలుచుకున్న కంటెంట్ చాలా పెద్దది. ఇందులో చాలా కమర్షియల్ మూమెంట్స్ ఉంటాయి. మీరు తప్పకుండా సినిమా చూడండి. అది మీకు అర్థమవుతుంది. ఆగస్టు 22న ఈ సినిమా మీ ముందుకు వస్తుంది. చాలా ప్రేమతో చేసిన సినిమా ఇది’’ అన్నారు. ప్రొడ్యూసర్ విజయ్ మాట్లాడుతూ.. ‘‘ఓ బేబీ సినిమాకి వర్క్ చేస్తున్నప్పుడు సురేష్ ప్రొడక్షన్లో పనిచేస్తున్నాను అని ఆనందపడ్డాను. సురేష్ బాబు గారి దగ్గర డైరెక్ట్ గా ఇండైరెక్టుగా చాలా విషయాలు నేర్చుకున్నాను. సురేష్ బాబు గారితో నాకు చాలా మంచి అనుబంధం ఉంది. సత్య వెరీ టాలెంటెడ్ యాక్టర్. సురేష్ బాబు గారు సత్య ఇద్దరు కూడా ఈవెంట్ కి రావడం చాలా ఆనందంగా ఉంది. ఈ పాటకు వనమాలి గారు గోపి సుందర్ అనురాగ్ అద్భుతమైన అవుట్ పుట్ ఇచ్చారు. ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు. అనుపమ ఒప్పుకోకపోతే ఈ సినిమా ఉండేది కాదు’’ అన్నారు.
ప్రొడ్యూసర్ శ్రీధర్ మాట్లాడుతూ.. ‘‘సురేష్ బాబు గారు ఈ కార్యక్రమానికి రావడం మా అందరికి చాలా ఆనందంగా ఉంది. సత్యదేవ్ గారు మాకు చాలా సన్నిహితుడు. మా మధ్య ఉన్న అనుబంధం ప్రత్యేకమైనది. ఇష్టంగా చాలా కష్టపడి చేసిన సినిమా ఇది. మూడేళ్ల ప్రయాణం’’ అన్నారు. డైరెక్టర్ ప్రవీణ్ కాండ్రేగుల మాట్లాడుతూ… ‘‘ఆగస్టు 22 మన మెగాస్టార్ గారి బర్త్‌డే. అంతకుమించి మంచి డేట్ దొరకదు. సురేష్ బాబు గారికి థాంక్యూ సో మచ్. సురేష్ బాబు గారు మాకు ఇన్స్పిరేషన్. సురేష్ బాబు గారికి సినిమాలు అంత ఈజీగా నచ్చవు. కానీ ఈ సినిమా చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు. సత్యదేవ్ గారు సాంగ్ ఇలా చేయడం చాలా ఆనందంగా ఉంది. మాకిది బాహుబలి లాంటి సినిమా’’ అని పేర్కొన్నారు.
ప్రజావాణి చీదిరాల