జైపూర్ లో జరిగిన ఐపీఎల్ 59 వ మ్యాచ్ పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్ చాలెంజర్స్ జట్ల మధ్య జరిగింది. టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ జట్టు నిర్ణీత ఓవర్లలో 5 వికెట్స్ కోల్పోయి 219 పరుగులు చేసింది. పంజాబ్ బ్యాటర్ 37 బంతుల్లో 70 పరుగులు ( 5 ఫోర్లు 5 సిక్సర్లు) , శ్రేయాస్ అయ్యర్ 25 బంతుల్లో 5 ఫోర్లు కొట్టి 30 పరుగులు, శశాంక్ సింగ్ 30 బంతుల్లో 59 పరుగులు ( 5 ఫోర్లు 3 సిక్సర్లు) చేయడంతో స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. రాజస్థాన్ బౌలర్ తుషార్ దేశ్ పాండే 2 వికెట్లు తీశాడు.
అనంతరం బాటింగ్ ప్రారంభించిన రాజస్థాన్ ఓపెనర్స్ యశస్వి జైస్వాల్ 25 బంతుల్లో 9 ఫోర్లు కొట్టి 50 పరుగులు, రఘువంశి 15 బంతుల్లో 40 పరుగులు ( 4 ఫోర్లు 4 సిక్సర్లు) చేసి రాజస్థాన్ జట్టు కు చక్కని ఆరంభాన్ని అందించారు. వారిద్దరి తర్వాత ధ్రువ్ జురెల్ 31 బంతుల్లో 53 పరుగులు 3 ఫోర్స్ 4 సిక్సర్లతో చెలరేగాడు. జురెల్ క్రీజ్ లో ఉన్నంత సేపు రాజస్థాన్ విజయం ఖాయం అనుకున్నారు ప్రేక్షకులంతా. మరో ఓవర్ మిగిలి ఉండగానే జూరెల్ అవుట్ అవ్వటంతో రాజస్థాన్ ఓటమి పాలైంది. తొలి 6 ఓవర్లలో 90 పరుగులు చేయటంతో గెలుస్తారని అనుకున్న సమయంలో ఆర్ ఆర్ జట్టు ఓడిపోయింది. ఈ మ్యాచ్ తర్వాత పంజాబ్ కింగ్స్ జట్టు 2nd ప్లేస్ లో నిలవగా, రాజస్థాన్ జట్టు 9 వ స్థానంలో నిలిచింది.
శివ మల్లాల