అందరం తెరపై సినిమాను చూసి ఎంజాయ్ చేస్తాం.
కానీ ఒక సినిమా తెరపై పడటానికి ఒక స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది.
ఏ సినిమా అయినా ఒక సినిమాగా రూపాంతరం చెందాలంటే స్టోరీ రైటర్ దగ్గరనుండే సినిమా స్టార్టవుతుంది.
అతడి బ్రెయిన్ చైల్డే ఒక్కో క్రాప్ట్‌ని కలుపుకుంటూ 24 శాఖలకు విస్తరించి సినిమాగా రూపుదిద్దుకుంటుంది.
నాగచైతన్య, సాయిపల్లవిల కాంబినేషన్‌లో విడుదలైన ‘తండేల్’ చిత్రం తొలుత ఎక్కడో ప్రారంభమైందో అతనే స్టోరీ రైటర్ కార్తీక్ తీడా.
శ్రీకాకుళం నుండి చిత్ర పరిశ్రమకు వచ్చిన కార్తీక్ ఫుల్ క్లారిటీతో ఉంటాడు.
తొలుత గ్రేట్ డైరెక్టర్ కృష్ణవంశీగారి దగ్గర అసోసియేట్‌గా పనిచేసిన కార్తీక్ స్టోరీరైటర్‌గా రూపాంతరం చెందారు.
బన్నీ వాస్‌లాంటి నిర్మాతకు దగ్గరవటం మొదటి సినిమానే పెద్ద కాంపౌండ్‌లో పడటం అతని ఫేట్‌ని మార్చటానికి కారణాలయ్యాయి.
‘తండేల్’ సినిమాని అతని పాయింట్‌లో తన కళ్లతో హీరో నాగచైతన్య ఎలా చూశాడో
కళ్లకు కట్టిపట్లుగా ట్యాగ్‌తెలుగుకి ఇచ్చిన ఇంటర్వూలో చెప్పారు.
అలాగే సాయిపల్లవి గురించి తనకు తన టీమ్ ఇచ్చిన ఫ్రీడమ్ గురించి ఎంతో గొప్పగా చెప్పారు కార్తీక్.
మీరు కార్తీక్‌లోని ఆనందాన్ని , ఆవేధనను ఒక్కసారి చూసేయండి…ఇంటర్వూ బై శివమల్లాల
Also Read This : 23 ఏళ్లకే సన్యాసి అయిన ఐఐటియన్ ఈయన…
