వందమందికి పైగా ఐ టెస్టులు. ఆనందం వ్యక్తం చేసిన జర్నలిస్ట్ కుటుంబాలు.

TFJA :

ఏ అసోసియేషన్‌ అయినా నలుగురికి ఉపయోగపడేలా ఆలోచిస్తే ఆ అసోసియేషన్‌కి మంచి గుర్తింపుతో పాటు వారెప్పుడూ పదిమందికి మంచి చేస్తారు అని ప్రశంశలు దక్కటం ఖాయం. అటువంటి అసోసియేషనే తెలుగు ఫిలిం జర్నలిస్ట్‌ అసోసియేషన్‌ (టిఎఫ్‌జెఏ). ఆసోసియేషన్‌ బాడిలోని అధ్యక్షుడు వి.లక్ష్మీనారాయణ, ఉపాధ్యక్షుడు ప్రసాదం.రఘు, జనరల్‌ సెక్రటరీ వై.జె రాంబాబు వీరంతా కలిసి తమ తోటి జర్నలిస్టులకు ఇన్సురెన్స్‌ల పరంగా, మెడికల్‌ ఎమర్జెన్సీలు వచ్చినప్పుడు, విధుల్లో ఉన్న జర్నలిస్ట్‌లకు ఏమైనా ప్రమాదాలు సంభవించినప్పుడు ఇమ్మిడియేట్‌గా స్పందించి ఎంతోమంది జర్నలిస్ట్‌లకు సాయం అందించారు. ఈ విషయం చిత్ర పరిశ్రమలోని తోటి జర్నలిస్ట్‌లందరికి తెలుసు. శనివారం టి.ఎఫ్‌.జే.ఎ ఆధ్వర్యంలో సినిమా జర్నలిస్టులకు వారి కుటుంబ సభ్యులకి శంకర్‌ నేత్రాలయ మరియు ఫినిక్స్‌ సంస్థలు కలిసి ఫిలింనగర్‌లోని ఫిలింఛాంబర్‌లో సంయుక్తంగా ఐక్యాంప్‌ నిర్వహించటం జరిగింది. ఎంతోమంది జర్నలిస్టులు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ కళ్లను చెక్‌ చేయించుకుని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా ‘సారంగపాణి జాతకం’ హీరో ప్రియదర్శి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ అధినేత నాగవంశీ, ఫినిక్స్‌ గ్రూప్‌ డైరెక్టర్‌ అవినాష్‌ చుక్కపల్లితో పాటు తదితరులు పాల్గొన్నారు. ప్రియదర్శి తన కళ్లను కూడా ఈ ఐక్యాంపులో చెక్‌ చేయించుకున్నారు. ఈ సందర్భంగా ప్రియదర్శి మాట్లాడుతూ అందరూ ఆరోగ్యంగా ఉండాలని అన్నారు. మంచి కార్యక్రమం చేస్తున్న అందరిని అభినందించారు.
శివమల్లాల

Also Read This : మరో ఇద్దరిని బరిలోకి దింపనున్న సుకుమార్..!

Singer Hymath Mohammed
Singer Hymath Mohammed

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *