ప్రముఖ క్యారెక్టర్ నటి రజిత అమ్మ విజయలక్ష్మీగారు హార్ట్‌స్ట్రోక్‌తో మార్చి 21వ తేదిన స్వర్గస్తులైన సంగతి తెలిసిందే.
మార్చి 31న హైదరాబాద్‌లో ఆమె పెద్దకర్మను ఘనంగా నిర్వహించారు రజిత.
ఈ సందర్భంగా రజిత తన తల్లిగురించి మాట్లాడుతూ కన్నీటి పర్వంతం అయ్యారు.
ఈ కష్టకాలంలో తనకు ఎంతో సాయం చేసిన బంధుమిత్రులు, శ్రేయోభిలాషులను గురించి మాట్లాడుతూ
మా అమ్మగారు అందరితో ఎంతో ప్రేమగా ఉండటంతోనే ఈ పదకొండురోజుల పాటు నాతోనే అందరూ ఉండి ఎంతో చక్కగా హెల్ప్ చేశారు.
ముఖ్యంగా చుట్టాలు అనేవారు ఎందుకు ఇంపార్టెంటో నాకు ఇప్పుడు అర్థమయ్యింది.
మా అమ్మ పోయిన రోజునుండి వారు నా మీద చూపించిన ప్రేమకు ఫిదా అయ్యాను.
పదకొండు రోజులనుండి ఈ రోజువరకు నేను ఇంట్లో ఒక్కపని కూడా చేయలేదంటే మీరు అర్థం చేసుకోవచ్చు.
వీరంతా నా మీద ఎంత ప్రేమ చూపించారో.
అందుకే అమ్మా నీవు లేకపోయినా నీ గుర్తుగా వీరందరూ నాతో ఉంటారు అంటూ రజిత కళ్ల నీళ్లు పెట్టుకుంటే ఆమె తోటి నటీనటులు, బంధువులు కన్నీరు పెట్టుకున్నారు.
ఈ కార్యక్రమంలో విజయలక్ష్మీగారి గురించి పలువురు మాట్లాడి ఆమె ఆత్మకి శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు.
రజిత వాళ్లమ్మగారి ఫోటోలను ఫ్రేమ్‌లుగా చేసి నాలుగు వైపుల పెట్టటంతో వచ్చిన వారందరూ ఆ ఫోటోలను ఎంతో ఇంట్రెస్ట్‌గా చూశారు.
చిత్ర పరిశ్రమలోని పలువురు ప్రముఖ దర్శకులు, నిర్మాతలు, టెక్నీషియన్లు దాదాపు 500 మందికి పైగా పాల్గొని రజితకు ధైర్యం చెప్పారు….
శివమల్లాల
Also Read This : ఒక్కరోజులో12 లక్షల లాభం వస్తే…18 లక్షల నష్టం వచ్చింది– వివాహ భోజనంబు మేనేజింగ్ పార్టనర్ రవిరాజు