Venu Swamy :
సోషల్ మీడియా లో ఫిల్మ్ సెలబ్రిటీస్ పై వ్యాఖ్యలు చేస్తూ పాపులర్ అయిన వేణు స్వామి ఈ మధ్య జరిగిన అక్కినేని నాగచైతన్య – శోభిత ధూళిపాళ ఎంగేజ్మెంట్ రోజున వారి జాతకాలను విశ్లేషణ చేస్తూ చేసిన వీడియో పెనుధుమారం లేపింది.
అసలు వ్యక్తి గత విషయాలు నలుగురి లో మాట్లాడ కూడదు అనే ఇంగిత జ్ఞానం కూడ లేని వేణుస్వామి వాళ్ళు ఎప్పుడు విడి పోతారో కూడా చెప్పేసాడు.
గతం లో సినిమా రిలీజ్ లపై, రాజకీయ ఫలితాలపై ఇలాంటి వ్యాఖ్యలే చేసి అభాసు పాలు అయినా కూడ బుద్ది రాని వేణుస్వామి నాగ చైతన్య – శోభిత లపై అలాంటి వ్యాఖ్యలే చేసాడు.
అతనిపై చర్యలు తీసుకోవాలి అని కోరుతూ..
తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ మరియి తెలుగు ఫిల్మ్ డిజిటల్ మీడియా అసోసియేషన్ తెలంగాణ స్టేట్ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ శ్రీమతి నీరెళ్ల శారద గారికి కలిసి పిర్యాదు చేసారు.
ఈ విషయం పై స్పందించిన ఛైర్ పర్సన్ శ్రీమతి నీరెళ్ల శారద గారు వేణుస్వామి పైన మరియు టెలికాస్ట్ చేసిన యూట్యూబ్ చానల్స్ పైన తప్పకుండా చర్యలు తీసుకుంటా మని హామీ ఇచ్చారు.
వేణుస్వామి ని పిలిపించి అతని వివరణ అడుగుతామని అన్నారు.
Also Read This : మోడర్న్ మాస్టర్స్ రివ్యూ