TS Inter Results :
ప్రథమ సంవత్సరంలో 60.01 శాతం పాస్
తెలంగాణలో ఇంటర్మీడియట్ ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. ప్రథమ సంవత్సరంలో 60.01 శాతం ఉత్తీర్ణత నమోదైంది. రెండో సంవత్సరం ఫలితాల్లో 64.61 శాతం ఉత్తీర్ణత నమోదైంది.
ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో 71.7 శాతం ఉత్తీర్ణతతో రంగారెడ్డి జిల్లా మొదటి స్థానంలో నిలవగా, 31.81 శాతం తో కామారెడ్డి ఆఖరి స్థానంలో నిలిచింది. కాగా, సెకండ్ ఇంటర్ ఫలితాల్లో 82.95 శాతం ఉత్తీర్ణతతో ములుగు జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. 44.29 శాతం తో కామారెడ్డి ఆఖరి స్థానంలో ఉంది. మొదటి, రెండవ సంవత్సరం ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో అమ్మాయిల పాస్ పర్సంటేజ్ 68.35 శాతం ఉండగా.. అబ్బాయిల పాస్ పర్సంటేజ్ 51.50 శాతం ఉంది. ఇంటర్ సెకండ్ ఇయర్ లో అమ్మాయిల పాస్ పర్సంటేజ్ 72.53 శాతం ఉండగా.. అబ్బాయిల పాస్ పర్సంటేజ్ 56.10 శాతం ఉంది.
ఇంటర్ ఫలితాలకు సంబంధించి మెమోలను బుధవారం సాయంత్రం నుంచే డౌన్ లోడ్ చేసుకోవచ్చని ఇంటర్ బోర్డు అధికారులు తెలిపారు. ఫలితాలపై రీవెరిఫికేషన్ కు బుధవారం నుంచి మే 2వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చునని పేర్కొన్నారు. అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలను మే 24వ తేదీ నుంచి నిర్వహించనున్నారు.
Also Read This Article : కాంగ్రెస్ లో ఎవరి ఇష్టం వారిదే?