Tanikella Bharani : తనికెళ్ల భరణి ఇకనుండి డాక్టర్‌ భరణి

Tanikella Bharani :

సుప్రసిద్ధ కవి, మాటల రచయిత, రంగస్థల నటుడు, నటుడు దర్శకుడు శ్రీ తనికెళ్ల భరణి.

దాదాపు 800 సినిమాల పైచిలుకు చిత్రాల్లో నటించి తెలుగు వారందరు మా భరణి అనుకునేంతగా పేరుగాంచిన సంగతి అందరికి తెలిసిందే.

గురువారం వరంగల్‌ ఎస్‌ఆర్‌ యూనివర్సిటి వారు తనికెళ్ల భరణి గారికి గౌరవ డాక్టరేట్‌ను ప్రకటించారు.

52 సినిమాలకు మాటలను అందించి రచయితగా అనేక విజయాలను అందుకున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం నుండి ‘సముద్రం’ సినిమాకు ఉత్తమ విలన్‌గా, ‘నువ్వు నేను’ సినిమాలోని నటనకు ఉత్తమ క్యారెక్టర్‌ నటునిగా,

‘గ్రహణం’తో ఉత్తమ నటునిగా, ‘మిథునం’ సినిమాకు గాను ఉత్తమ రచయిత మరియు ఉత్తమ దర్శకునిగా అయిదు నంది అవార్డులను అందుకున్నారాయన.

ఎస్‌ఆర్‌ యూనివర్శిటి వారు ప్రకటించిన అవార్డును ఆగస్ట్‌ 3వ తారీకు శనివారం వరంగల్‌లో జరిగే యూనివర్శిటి స్నాతకోత్సవ వేడుకలో ఆయనకు డాక్టరేట్‌ను ప్రధానం చేయనున్నారు.

40 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ విద్యా సంస్థ యూనివర్శిటిగా మారిన తర్వాత ఆస్కార్‌ అవార్డు గ్రహిత చంద్రబోస్‌ను గౌరవ డాక్టరేట్‌తో గతంలో సత్కరించింది.

Also Read This : సినిమా మీద ప్యాషన్‌ ఉంటేనే సరైన నిర్మాత అవుతారు

Ananya Naagalla Exclusive Interview
Ananya Naagalla Exclusive Interview

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *