Retro Review :
విడుదల తేది– 01.05.2025
నటీనటులు– సూర్య, పూజా హెగ్డే
ఎడిటర్– షఫిక్ మహమ్మద్ అలీ
సినిమాటోగ్రఫీ– శ్రేయాస్ కృష్ణ
సంగీతం– సంతోష్ నారాయణ్
నిర్మాత– సూర్య, జ్యోతిక
దర్శకత్వం– కార్తీక్ సుబ్బరాజు
కథ :
సినిమా 1960లో ప్రారంభమవుతుంది. దేవాలయంలో జరిగిన గలాటాలో 3 ఏళ్ల బాలునిగా ఉన్న చిన్నబాబు రౌడిగ్యాంగ్ మెయింటైన్ చేసే జోజు జార్జ్ కంటపడతాడు. పిల్లలు లేని జోజు జార్జ్ భార్య మనకు దేవుడిచ్చిన బిడ్డ వీడు అంటూ అపురూపంగా పెంచుకుంటుంది. ఆ పిల్లాడికి విచిత్రమైన జబ్బు ఉంటుంది. అతనికి మొఖంలో నవ్వుండదు. తనకు తానుగా నవ్వుదామని ఎంత ట్రై చేసినా నవ్వు రాదు కూడా. చిన్న బిడ్డగా ఉన్న అతనే మన సినిమా హీరో సూర్య. చిన్నప్పటి నుండి పెంపుడు తండ్రిని చూసి పెరిగిన సూర్య కూడా రౌడిలాగానే పెరుగుతాడు. విపరీతమైన కోపంతో ఉండే సూర్య.. వెటర్నరీ (జంతువుల) డాక్టర్‌గా ఉన్న పూజా హెగ్డే కోసం తన కోపాన్ని తగ్గించుకుని ఇక నుంచి రౌడి పనులన్నీ మానుకుంటున్నానని తోటి రౌడిలను పిలిచి మీటింగ్ పెట్టి మరి చెబుతాడు. వారిద్దరికి పెళ్లి ఫిక్స్ అవుతుంది. ఆ పెళ్లిలో ఏం జరిగింది? వారిద్దరికి నిజంగానే పెళ్లయిందా? ఇంతకీ జోజు జార్జ్‌కి దొరికిన బిడ్డ ఎవరు? ఎక్కడ నుంచి అక్కడికి వచ్చాడు? చివరిగా అతనికి నవ్వువచ్చిందా? ఇలాంటి అనేక చిక్కుముడుల గురించి లె లియాలంటే సినిమా థియేటర్‌లోనే చూడాలి.
నటీనటుల పనితీరు..
నటన పరంగా సూర్య ఏ రేంజ్‌లో నటిస్తారో అందరికి తెలుసు. సూర్య ఒక్కో ఏజ్‌లో ఒక్కోలా నటిస్తూ నటునిగా మంచి మార్కులు కొట్టేశాడు. తనవంతుగా తాను ఎంత బాగా నటించినప్పటికి కథలో కంటెంట్ కొరవడితే ఎవరు మాత్రం చేయగలరు. ఇకపోతే నాజర్, ప్రకాశ్‌రాజ్ వంటి నటులు పేరుకు మాత్రమే ఈ సినిమాలో నటించారా అన్నట్లుగా ఉంటుంది. సూర్య, పూజా హెగ్డే, జోజుజార్జ్, జయరాం వంటి నటులకు మాత్రమే ఈ సినిమాలో నటించే అవకాశం ఉంది. మిగతా నటీనటులకు నటించే అవకాశం పెద్దగా లేదనే చెప్పాలి. ఎమోషసల్‌గా కథకు కనెక్ట్ అవ్వకపోతే ఎంత గొప్పగా నటించిన ఫలితం ఉండదు.
టెక్నికల్ విభాగం..
కథ బాగున్నప్పుడు అన్ని బాగుంటాయి. ఒక్క కథపై తప్ప మిగతా అన్ని విషయాలపై ఫోకస్ ఎక్కువ పెడితే ఫలితాల గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ముఖ్యంగా రెట్రో సినిమాలో ఫైట్స్‌కి పెద్దపీట వేసి చేసిన ఫీలింగ్ కనిపిస్తుంది ఎవరికైనా. కొన్ని ఫైట్ సీక్వెన్స్ చూస్తున్నప్పుడు హాలీవుడ్ సినిమా గ్లాడియేటర్ గుర్తుకు వస్తుంది. కానీ, ఆ సీన్లన్ని చాలా ఇబ్బందికరంగా అనిపిస్తూ ఉంటాయి. కెమెరా వర్క్ బావున్నా మనం ఏ సందర్భంలోను పెద్దగా కనెక్ట్ అవ్వలేం. ఎడిటింగ్‌లో కట్ చేసే సన్నివేశాలు పుష్కలంగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్ :
సూర్య నటన
కొన్ని ఫైట్స్
మైనస్ పాయింట్స్ :
కథకు అడ్డొచ్చే అవసరం లేని సీన్లు
సంగీతం
ఎడిటింగ్
ఫైనల్ వర్డిక్ట్ :
ఓల్డ్ రమ్ ఇన్ న్యూ బాటిల్..
రేటింగ్: 2/5
శివమల్లాల
Also Read This : ‘హిట్ 3’తో నాని హిట్ కొట్టినట్టేనా?