ఎప్పటికప్పుడు వైవిధ్యమైన కంటెంట్‌తో ప్రేక్షకులను అలరిస్తోన్న ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ జీ5 నుంచి మరో సూపర్‌హిట్ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ సినిమాయే ‘హే బల్వంత్’. ఈ కామెడీ డ్రామా మార్చి 31 నుంచి తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో జీ5లో స్ట్రీమింగ్ అవుతుంది. గోపి ఆచార్య దర్శకత్వం వహించటంతో పాటు ఈ చిత్రానికి కో రైటర్‌గానూ వర్క్ చేశారు. సుహాస్, శివానీ నాగరం హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో వి.కె.నరేష్ కీలక పాత్రను పోషించారు. త్రిశూల్ విజనరీ స్టూడియోస్ బ్యానర్‌పై బి.నరేంద్ర రెడ్డి ఈ మూవీని నిర్మించారు.
https://www.instagram.com/p/DWYMS3CEdoV/
గుంటూరు నేపథ్యంలో ‘హే బల్వంత్’ సినిమాను రూపొందించారు. యువకుడైన కృష్ణ(సుహాస్)కు తండ్రి వ్యాపారాన్ని కొనసాగించాలనే ఆసక్తి ఉంటుంది. అయితే తన తండ్రి చేసే వ్యాపారం ఏదో తెలియటంతో తను షాకవుతాడు. అదే సమయంలో మిత్ర(శివానీ నాగరం)తో ప్రేమలో ఉంటాడు. మిత్ర ఓ ఎన్జీఓను నడుపుతుంటుంది. ప్రేమ, నైతిక విలువలు, తన తండ్రి రావు బాల్వంత్ చేస్సే బిజినెస్ విషయం తెలిస్తే ఏమవుతుందనే ఆలోచనల మధ్య కృష్ణ ఇరుక్కుపోతాడు. ఈ క్రమంలో వచ్చే కడుపుబ్బా నవ్వించే కామెడీ, తండ్రీ కొడుకు మధ్య అనుబంధం, అసలేం జరిగిందనే నిజానిజాలు, చివరకు ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు అనేదే అసలు కథాంశంగా సినిమా రూపొందింది.
ఈ సందర్భంగా సుహాస్ మాట్లాడుతూ ‘‘సినిమా నాకెంతో నచ్చింది. ఎందుకంటే ఇది ఆశయాలు, కుటుంబం, మనం ఎక్కువగా పట్టించుకోని నైతిక సందిగ్ధత గురించి చెబుతుంది. సినిమాలో మంచి కామెడీ ఉంది. అలాగే హృదయాన్నిహత్తుకునే భావోద్వేగం ఉంది. నిజాయతీతో చేసిన ప్రయత్నం కనిపిస్తుంది. ఈ సినిమా ఇప్పుడు జీ5 ద్వారా ప్రేక్షకుల దగ్గరకు చేరుతుండటం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇది మరింత ఎక్కువ మందికి రీచ్ అవుతుందని నమ్మకముంది’’ అన్నారు.
సీనియర్ నటుడు వి.కె.నరేష్ మాట్లాడుతూ హే బల్వంత్ సినిమాలో తండ్రీ కొడుల మధ్య ఉన్న అనుబంధాన్ని ఎంతో అందంగా చూపించారు. ఇందులో బల్వంత్ పాత్ర చేయటం సాధారణ విషయం కాదు. నటుడిగా నాలో భిన్నమైన కోణాన్ని ఆవిష్కరించిన సినిమా ఇది. వైవిధ్యమైన, అర్థవంతమైన తెలుగు కథలను ఎప్పటికప్పుడు ప్రోత్సహించే జీ5లో ఈ సినిమా విడుదలవడం నాకు చాలా సంతోషంగా ఉంది’’ అన్నారు.
* ‘బల్వంత్’ సినిమాను మార్చి 31న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో జీ5లో వీక్షించండి
ZEE5 గురించి:
ZEE5 భారతదేశంలో అతిపెద్ద ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్. ఎప్పటికప్పుడు కొత్త ఎంటర్టైన్మెంట్ను కోరుకునే కోట్లాది ప్రేక్షకులకు అనేక భాషల్లో ఎంటర్టైన్మెంట్ను అందించే వేదిక అలరిస్తోంది. ZEE ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ (ZEEL) అనే గ్లోబల్ కంటెంట్ సంస్థ నుంచి ఇది ప్రారంభమైంది. వీడియో ఆన్ డిమాండ్ ప్లాట్‌ఫామ్‌గా ZEE5 విస్తృతమైన కంటెంట్ లైబ్రరీని అందిస్తోంది. ఇందులో 4,071కు పైగా సినిమాలు, 1,800కు పైగా టీవీ షోలు, 422కు పైగా వెబ్ ఒరిజినల్స్, 4,492కు పైగా మ్యూజిక్ వీడియోలు, ఇంకా 1.35 లక్షల గంటలకు పైగా కంటెంట్ అందుబాటులో ఉంది.
జీ512 భాషల్లో కంటెంట్‌ను అందిస్తోంది. హిందీ, తమిళం, తెలుగు, బెంగాళీ, మలయాళం, కన్నడ, మరాఠీ, ఇంగ్లీష్, ఒరియా, భోజ్‌పురి, గుజరాతీ, పంజాబీ. అలాగే 7 రకాల వ్యక్తిగత, ప్రాంతీయ సబ్స్క్రిప్షన్ ప్యాక్స్ ద్వారా వివిధ రకాల ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తోంది. ZEE5లో ఒరిజినల్ షోలు, భారతీయ, అంతర్జాతీయ సినిమాలు, టీవీ కార్యక్రమాలు, పిల్లల కోసం షోలు, న్యూస్, లైవ్ టీవీ వంటి విభిన్న కంటెంట్ అందుబాటులో ఉంది.అలాగే ప్రపంచ స్థాయి టెక్నాలజీ భాగస్వామ్యాలతో రూపొందించిన శక్తివంతమైన టెక్ స్టాక్ వల్ల, ZEE5 అనేక డివైసులు, ప్లాట్‌ఫార్ములు, ఆపరేటింగ్ సిస్టమ్స్‌లో స్మూత్‌గా పనిచేసే అనుభవాన్ని అందిస్తోంది.