మునుపెన్నడూ కనిపించని లుక్‌లో సుహాస్..

ప్రముఖ నిర్మాణ సంస్థ ఆర్ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్‌ అధినేత ఎల్రెడ్ కుమార్ తన 16వ ప్రాజెక్ట్‌గా ‘మండాడి’ అనే స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాను ప్రకటించారు. ఈ సినిమాకు మతిమారన్ పుగళేంది దర్శకత్వం వహించనున్నారు. నటుడు సూరి ప్రధాన పాత్రలో మహిమా నంబియార్ హీరోయిన్‌గా రూపొందనున్న ఈ చిత్రంలో సుహాస్ ఒక ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు. ఈ స్పోర్ట్స్ డ్రామాతో సుహాస్ తమిళ అరంగేట్రం చేస్తున్నాడు. ఈ సినిమా అన్ని భాషల్లోను రూపొందనుంది. ఈ సినిమాకు సంబంధించి టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను నిర్మాతలు ఇప్పటికే విడుదల చేశారు. తాజాగా సుహాస్ ఫస్ట్‌లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు.

ఫస్ట్‌లుక్ పోస్టర్‌లో సుహాస్.. ఆసక్తికరంగానూ.. మునుపెన్నడూ కనిపించని రీతిలో కనిపిస్తున్నాడు. లుంగీ ధరించి.. నెరిసిన జుట్టుతో.. జెర్సీ వేసుకుని కనిపించాడు. ‘సునామీ రైడర్స్’ బృందంతో సముద్ర తీరంలో సుహాస్ నిలబడి ఉన్నాడు. మరో పోస్టర్ సినిమా కథను కొంతమేర రివీల్ చేసింది. సూరి, సుహాస్ ఇద్దరూ స్వయంగా పడవలు నడుపుతూ.. ఒకరికొకరు అపోజిట్ వేలో కనిపించారు. దీంతో సినిమాలో వీరిద్దరి మధ్య గట్టి పోరు జరుగనుందని తెలుస్తోంది. ఈ చిత్రంలో సుహాస్ బలమైన ప్రతి నాయకుడిగా కనిపించనున్నాడని పోస్టర్‌ను బట్టి తెలుస్తోంది. సత్యరాజ్, రవీంద్ర విజయ్, అచ్యుత్ కుమార్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ప్రజావాణి చీదిరాల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *