ఆస్కార్‌ను ముద్దాడిన తెలుగు సినిమా ‘ఆర్‌ఆర్‌ఆర్’. ఈ భారతీయ ఆస్కార్ సినిమా వెనుక ఎంతమంది కష్టపడ్డారు.
ఒక్కో సీన్‌కి నటీనటులు, టెక్నీషియన్ల శ్రమ ఏ రేంజ్‌లో ఉందో ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా తెలియాలి.
సినిమా చూసిన ప్రతిఒక్కరు ఆ సినిమాలోని తప్పులను వెతుకుతుంటారు.
ఎవరిష్టానికి వారు ప్రతి సినిమా గురించి రకరకాలుగా మాట్లాడుతారు.
అది వారి వ్యక్తిగత అభిప్రాయం. అలాంటి వారందరూ ఖచ్చితంగా సినిమా వెనుక జరిగే తతంగం అంతా కళ్లారా చూడాలి.
అలా చూడటానికి సినిమా రేంజ్‌లో రూపొందిన ‘ఆర్‌ఆర్‌ఆర్ బిహైండ్ అండ్ బియాండ్’ అని
గంటా ముప్పై ఎనిమిది నిమిషాల కంటెంట్‌ను ప్రేక్షకులకోసం రెడీచేశారు ఎస్.ఎస్ రాజమౌళి అండ్ టీమ్.
వాల్ట్స్ అండ్ ట్రెండ్స్ ప్రొడక్షన్లో విడుదలైన ఈ కంటంట్‌లో సినిమా ప్రీ–ప్రొడక్షన్‌నుండి ఆస్కార్ గుమ్మం వరకు ఎలా వెళ్లారు? ఆస్కార్‌ను ఎలా సాధించారు?
అని ఆ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్క టెక్నిషియన్‌ల మాటలు నటీనటుల ఇంటర్వూలు అత్యద్భుతంగా అనిపించింది.
యన్టీఆర్, రామ్‌చరణ్‌ల అల్లరి రాజమౌళి అండ్ టీమ్, కీరవాణి, కార్తికేయ, రమా రాజమౌళి, కెకె.సెంథిల్‌కుమార్, శ్రీకర్ ప్రసాద్, శ్రీనివాస మోహన్, చంద్రబోస్,
ప్రేమ్‌రక్షిత్, సాబుశిరిల్, కింగ్ సాల్మన్‌ల కష్టానికి తగ్గ ప్రతిఫలాన్ని మరో సినిమాలాగా విడుదల చేశారు.
సినిమా లవర్స్ ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు.
శివమల్లాల
Also read this : 2024లో ఊహించని పరిణామాలు
