Chiru-Odela-Nani :
బ్లడ్‌ప్రామిస్ చేసిన మెగాస్టార్…
మెగాస్టార్ చిరంజీవి ఫుల్ స్వింగ్‌లో వర్క్ చేస్తున్నారు. వయసుతో సంబంధమే లేదు అన్నట్లు మంచి దూకుడు మీదున్నారు చిరంజీవి.
ప్రస్తుతం ఆయన నటిస్తున్న సినిమా సెట్స్‌పై ఉండగానే మరో ఇద్దరి దర్శకులతో కమిట్ అయ్యారు చిరంజీవి.
వశిష్ట దర్శకత్వం వహిస్తున్న ‘విశ్వంభర’ షూటింగ్ పనులు దాదాపు చివరిదశకు చేరుకోవటంతో ‘దసరా’ దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో కమిట్ అయ్యారు చిరు.
చిరంజీవి, నాని కాంబినేషన్‌లో మూవీ అనగానే మెగాఫ్యాన్స్‌లో సందడి నెలకొంది.
ఈ చిత్రాన్ని యస్‌ఎల్‌వి సినిమాస్, యునానిమస్ ప్రొడక్షన్‌ల జాయింట్ వెంచర్‌గా రూపుదిద్దుకోనుంది.
ఈ సినిమా తర్వాత నవ్వుల మాంత్రికుడు అనిల్ రావిపూడి సినిమాకి కూడా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారట మెగాస్టార్….
శివమల్లాల
Also Read This : అలీ హీరోగా ‘వెల్‌కమ్ టు ఆగ్రా’