Srikanth Iyengar :
టాలెంట్ ఉంటే 24 శాఖలకు చెందిన ఎవ్వరినైనా భుజాలపై మోసేది మీడియానే. వారెవరు మీడియాకి రక్త సంబంధీకులు కారు.
ఈరోజు ‘పొట్టేల్’ సినిమా సక్సెస్‌మీట్‌లో వినలేని పదాలతో అసభ్య పదజాలంతో రివ్యూరైటర్లను ధూషించారు నటుడు శ్రీకాంత్ అయ్యంగార్.
మనం ఏం మాట్లాడుతున్నామో సోయ లేకుండా మాట్లాడే చాలామంది చెదపురుగుల్లాంటి నీచమైన మనుషులు నటులుగా చలామణిలోకి వచ్చారు.
అలాంటి వారు వచ్చినప్పుడు అతనిలో చాలా మంచి నటుడున్నాడని రాసింది ఈ మీడియానే.
ఇండస్ట్రీకి వచ్చినప్పుడు వారెవరో ఎవరికి తెలియకపోయినా , ముక్కుమొహం తెలియని వాళ్లందరూ చిన్నపాత్రలో నటించినా కూడా వారి గురించి మెచ్చుకోలుగా నాలుగు మాటలు రాస్తాం.
వారు ఎంత బాగా నటించారు అని రకారకాలుగా వర్ణించి అందలం ఎక్కించిన తర్వాత నీచంగా మాట్లాడటం ఎంత సంస్కార హీనమో, దిగజారుడు తనానికి ఇంతకంటే నిదర్శనం లేనే లేదు.
నీచమైన పదజాలాన్ని ఎవరు ఉపయోగించిన చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు. దిగజారటానికి ఇంతకంటే పరాకాష్ట ఉండదు.
అది నటులైనా, 24 శాఖలకు సంబంధించిన ఎవరైనా, మీడియా అయినా తగిన శిక్షలు అనుభవిస్తారు.
ఇది తథ్యం… క్విట్ అండ్ క్వైట్ శ్రీకాంత్ ఇన్ టాలీవుడ్…. శివమల్లాల
Also Read This : జానీ మాస్టర్ జీవితాన్ని నాశనం చేసారు…