అయ్యప్ప స్వామినే మెచ్చిన భక్తుడు శ్రీ నండూరు సత్యనారాయణ చార్యులు గారి జన్మదిన వేడుక

ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప. అయ్యప్పను కలియుగ దైవంగా కొలుస్తారు.

ఒక భక్తుడు అయ్యప్ప సేవ కోసం నిత్యం పరితపిస్తుంటే ఆ స్వామి ఇచ్చిన ప్రతిఫలం ఎవ్వరూ ఊహించలేరు.

అలాంటి ప్రతిఫలం పొందిన భక్తుడే మన గురు స్వామి సత్యనారాయణ గారు. అసలు విషయం ఏంటంటే సత్యనారాయణ స్వామి 1967 లో నూజివీడు గ్రామంలో జన్మించారు.

ఆయన బాల్యం అంతా గుడివాడలో సాగింది. ఆయన చిన్నప్పటినుంచి ఎంతో భక్తిభావనతో ఉండేవారు.

తనకి 25 సంవత్సరాల వయసులో రావులపాలెం దగ్గర ఆత్రేయపురం మండలం చిన్నవాడపల్లి అనే గ్రామంలో

ఏడువారాల వెంకటేశ్వర స్వామి ఆలయంలో అర్చకులు తన మొదటి ప్రస్థానాన్ని మొదలుపెట్టారు.

కొంత కాలానికి అదే గ్రామానికి చెందిన లక్షీ తయారు గారిని వివాహం ఆడారు.

తర్వాత కొంత కాలానికి నండూరు సత్యనారాయణ చార్యులు గారు అయ్యప్ప మాల వేసుకుంటా అని ఆ గుడిలో సిబ్బందిని ఆడగగా దానికి వాళ్ళు

అయ్యప్ప మాల వేసుకొని వెంకన్న స్వామికి పూజ ఎలా చేస్తావు అని వాళ్ళు ఒప్పుకోలేదు.

అది విన్న వెంకటేశ్వర స్వామి అయ్యప్ప నీ భక్తుడిని నీ దగ్గరకి పంపిస్తున్నా నువ్వే జాగ్రత్తగా చూసుకో అని చెప్పారు.

దానితో సత్యనారాయణ చార్యులు గారు చిన్నవాడపల్లి దేవాలయంలో అర్చకులుగా మానేసి హైదరాబాద్ వచ్చారు.

ఇక్కడ పలుచోట్ల అర్చకుల జాబ్ కోసం వెతకగా ఎక్కడా ఖాళీ లేకపోయేసరికి చివరకి సనత్ నగర్ హనుమాన్ దేవాలయంలో ప్రసాదాలు తయారు చేయటం దగ్గర జాబ్ ఖాళీ ఉంటే

కొంచం ఆలోచించి పక్కనే అయ్యప్ప స్వామి దేవాలయం ఉండటంతో ఏదొకటిలో ముందు ఆ స్వామికి దగ్గరలో ఉంటాం గా అని ఆ జాబ్ లో జాయిన్ అయ్యారు.

తర్వాత కొంతకాలానికి అయ్యప్ప దేవాలయంలో అర్చకులుగా జాయిన్ అయ్యి ఇప్పుడు పెద్ద గురుస్వామిగా ఉంటూ నిత్యం 24/7 ఆ అయ్యప్ప స్వామికి పూజలు చేసుకుంటూ ఉన్నారు.

గతంలో అసలు అయ్యప్ప మాల వేసుకోవద్దు అన్నారు కానీ ఇప్పుడు గత 27 సంవత్సరాలుగా ఎల్లప్పుడూ అయ్యప్ప మాలను మెడలో ధరించే ఉన్నారు నండూరు సత్యనారాయణ చార్యులు గారు.

ఇది అయ్యప్ప స్వామి మహత్యం అంతే మాల వేసుకోడానికి వీల్లేదు అని భక్తుడు బాధపడుతుంటే

ఆ భక్తుడిని నిత్యం నా సేవ చేసుకోమని నండూరు సత్యనారాయణ చార్యులు గారికి మోక్షాన్ని ప్రసాదించించాడు ఆ అయ్యప్ప స్వామి.

ఇక నండూరు సత్యనారాయణ చార్యులు, నండూరు లక్ష్మీతాయారు కి ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఇద్దరు సంతానం ఉన్నారు.

అబ్బాయి నండూరు ఫణి కుమార్ వాళ్ళ నాన్నకి సేవ చేసుకుంటా అదే అయ్యప్ప దేవాలయంలో అర్చకులుగా పని చేస్తూ ఉన్నారు.

ఇక వాళ్ళ అమ్మాయి కి పెళ్ళి అయ్యి తనకి ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి ముగ్గురు సంతానం.

ఇక ఎంతో విజయవంతంగా 67 సంవత్సరాలు పూర్తిచేసుకొని 68 వ పుట్టినరోజు జరుపుకుంటున్న మన నండూరు సత్యనారాయణ చార్యులు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.

మీరు ఇలాంటి జన్మదినాలు మరెన్నో జరుపుకోవాలని కుటుంబంతో కలకాలం ఆనందంగా ఉండాలని ఆ అయ్యప్ప స్వామికి మీరు పూజలు చేస్తూ ఉండాలని కోరుకుంటూ

మా ట్యాగ్ తెలుగు టీమ్ మీకు బెస్ట్ విషెస్ తెలియజేస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *