ప్రభు వచ్చాడా? ప్రభు ఎక్కడ? ప్రభు వస్తున్నాడా? కొంచెం సేపు వెయిట్ చేద్దాం….
సరిగ్గా 20 ఏళ్ల క్రితంవరకు అప్పటి సినిమా ప్రెస్‌మీట్లలో కనిపించే రెగ్యులర్ దృశ్యమిది.
ఈ మాటలు అనేది సాదాసీదా వ్యక్తులు కాదు. ఆ సంబంధిత సినిమా పీఆర్వోతో పాటుగా, తోటి జర్నలిస్ట్‌లే కాకుండా,
సినిమా యూనిట్‌లోని నిర్మాత, దర్శకుడు, క్యారెక్టర్ ఆర్టిస్ట్, హీరో, హీరోయిన్ అనే తేడాలేకుండా ప్రతి ఒక్కరు అడిగే ప్రశ్న ఇది.
ఒక జర్నలిస్ట్ గెలిచారు అనటానికి ఇంతకంటే మాటలు అవసరం లేదు.
ఈ ఒక్క ప్రశ్న అంతమంది నోట రావటమే ఆయన జర్నలిస్ట్‌గా గెలిచారు అనటానికి నిదర్శనం…
ఒక జర్నలిస్ట్ ఎంతో టాలెంటెడ్, ప్రొఫెషనల్ అనటానికి ఇంతకంటే పెద్ద నిదర్శనలేమి అవసరం లేదనుకుంటాను.
చిత్ర పరిశ్రమలోని 24 శాఖలకు సంబంధించినవారికి ఏ జర్నలిస్ట్ పేరైనా తెలుస్తుందో లేదో కానీ, జర్నలిస్ట్ ప్రభు పేరు మాత్రం తెలియని వారుండరు.
ప్రతి ఒక్కరు ఎదురొచ్చి ఎంతో ఆప్యాయంగా ప్రభు గారొచ్చారు అనుకుంటూ సాదరంగా ఆహ్వానిస్తారు.
ఆయన్ని చాలమంది నటులు రౌడి అని, రౌడి జర్నలిస్ట్ అని, ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ కొంతమంది ఇంట్లో మనిషిలా అనుకుని
అన్న, బావ, తమ్ముడు అని రకారకాలుగా పిలుచుకుంటారు. ఇంతమందికి ఇన్ని వరసల్లో ఇష్టమైన ప్రభుకి మాత్రం వారువీరు అనే తేడానే ఉండదు.
గుడ్ ఈజ్ ఆల్వేస్ గుడ్..బట్ మాట్లాడాల్సిన టాపిక్ బ్యాడ్ అయితే మాత్రం ఆయన ఎదురు వ్యక్తి ఎవరు అని చూసే పరిస్థితే ఉండదు.
అది ఒక నిఖార్సయిన జర్నలిస్ట్ అదర్‌సైడ్. గుడ్‌ను, బ్యాడ్‌ను రెంటిని బ్యాలెన్స్ చేస్తూ ఉండటమే ఎవర్‌గ్రీన్ జర్నలిస్ట్ ప్రభు స్పెషాలిటి.
అందుకే ఆయన ఇండస్ట్రీలోకి డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌తో ఎంట్రీ ఇచ్చినా జర్నలిస్ట్‌గా మారి దాదాపు 40 ఏళ్లయింది.
అప్పటికి ఇప్పటికి అదే స్పెషాలిటీని మెయిన్‌టైన్ చేస్తూ , కాలర్ ఎత్తుకుని నేను జర్నలిస్ట్ ప్రభుని అని చెప్పటం అందరికి కుదరదు.
ఆయనకు మాత్రమే సెట్ అయ్యే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అది. అందుకే ఆయన గెలిచారు…
ఎంతో హుందాగా తిరుగుతున్న ఆయన మరో 40 ఏళ్లు ఇలాగే ఆనందగా గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ
హ్యాపి బర్త్‌డే టు జర్నలిస్ట్ ప్రభు గారు అంటూ విషెశ్‌ను తెలియచేస్తుంది ట్యాగ్‌తెలుగు యూట్యూబ్ మరియు ట్యాగ్‌తెలుగు.కామ్.
శివమల్లాల
Also Read This : క్విట్ అండ్ క్వైట్ శ్రీకాంత్ అయ్యంగార్….