స్పిరిట్చువల్ గురు కథ…..
సమంత ‘అత్తారింటికి దారేది’ సినిమాలో పవన్‌కల్యాణ్ గురించి తెలుసుకోవటానికి గూగుల్ చేస్తుంది.
అందులో పవన్ గురించి 100 పేజిలుంటుంది. అప్పుడు సమంత పాత్రకు జ్ఙానోదయమవుతుంది.
అలాగే నేను ఒక ఇంటర్వూ చేసే అవకాశం వచ్చిన తర్వాత ఆయన గురించి గూగుల్ చేస్తే నా జ్ఙానం నాకు అర్ధమయ్యింది. ఆయనెవరో మీరే చూడండి…
హిందువులందరికి ఎంతో ఇష్టుడు శ్రీకృష్ణుడు.
ఆయనే లోకం అంటూ ఎంతోమంది తమ జీవితాన్ని స్వామికి అంకితం చేస్తుంటారు.
అలాంటివారు కొన్ని దశాబ్దాల తర్వాత స్వామీజీలుగా అవతరిస్తారు.
వారు మాట్లాడే ప్రతి ఒక్కమాట ఆచి తూచి మాట్లాడుతూ ప్రశాంతమైన జీవితానికి ధైవమార్గం ఎంతో గొప్పదని తమ బోధనల ద్వారా తెలియచేస్తారు.
అలాంటి గొప్ప ఆధ్యాత్మిక గురువు స్వామి ముకుందానంద.
ఆయన రచించిన భగవద్గీతను తెలుగులో ప్రముఖ సంగీత దర్శకుడు ఆలపించి తన గొంతుతో మ్యాజిక్ చేసి 18 ఎపిసోడ్‌ల వీడియోను తయారుచేశారు.
అందుకే తెలుగువారందరికి అర్థమయ్యే విధంగా కృష్ణుని గురించి పాడినందుకు ఆర్.పి గారి మీద ప్రేమతో
స్వామి ముకుందానందగారు ట్యాగ్‌తెలుగు ఛానల్‌కి వచ్చి ఇంటర్వూలో పాల్గొన్నారు.
నిజమైన జర్నలిస్టుల అదృష్టం ఏంటంటే ప్రపంచంలోని గొప్పవారందరిని కలిసి మాట్లాడే అదృష్టం ఒక్క జర్నలిస్ట్ వృత్తిలో ఉన్నవారికే కలుగుతుంది.
ఆ అనుభూతిని మాటల్లో ఎంతచెప్పినా తక్కువే. అనుభవించిన వారికే వాటి విలువ తెలుస్తుంది.
స్వామి ముకుందానంద గారిని , ఆర్.పి గారిని కలిపి ఇంటర్వూ చేసే అవకాశం నాకు దొరకటం అదృష్టంగా భావిస్తున్నాను.
ఆయనతో ఓ రెండుగంటల పాటు మా ఆఫీసులో స్వామిజీకి ఆతిధ్యం ఇవ్వటం..
నిజంగా కాలం కలిసిరావటం అంటే ఇదేనేమో అనిపించింది.
ఈ సందర్భంగా సోదరుడు గొప్ప సంగీతదర్శకుడు ఆర్.పి గారికి థ్యాంక్స్.
ప్రపంచవ్యాప్తంగా అనేక కృష్ణుని ఆశ్రమాలు నెలకొల్పిన స్వామిజీగారు నేను అడిగిన వ్యక్తిగత, సామాజిక ప్రశ్నలను ఎంతో ఓపికతో సమాధానం చెప్పారు.
వీలైతే తప్పనిసరిగా ఈ ఇంటర్వూను ఒకసారి చూడండి మీ ట్యాగ్‌తెలుగు యూట్యూబ్ చానల్‌లో…ఇంటర్వూ బై శివమల్లాల
Also Read This : బడ్జెట్ దేశప్రజల సంక్షేమం కోసమే…
