మల్టీటాలెంటెడ్ పర్సనాలీటికి పర్‌ఫెక్ట్ ఉదాహరణ ఈ పేరు…
తాను రాయగలడు ఆ రాతలతో రాళ్లకైన కన్నీళ్లు తెప్పించగలడు…అంత మంచి ఎమోషనల్ రైటర్. జాతీయ సమైక్యత గురించి రాసిన అంతే…ఒక నటుని గురించి రాసిన అంతే..ఒక సింగర్ గురించి రాసిన అంతే…చివరికి తన ఇంటమ్మ పద్దు గురించి రాసిన అంతే…మనసును తడిచేస్తాడు..ఏడిపించేస్తాడు…అదంతే అతనికి మాత్రమే తెలిసిన అదో ఆర్టు…
నటిస్తాడు కానీ అది నటనలా ఉండదు..ఎందుకంటే అది నటన కాదు కాబట్టి…అతడు నటునిగా జీవిస్తాడు కాబట్టి…
అసిస్టెంట్ డైరెక్టర్ అంటే ఏంచేస్తాడో తెలియకుండానే రాము దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ అయ్యాడు.. కట్ చేస్తే
శివ సినిమాలో క్యాంటీన్ కుర్రాడు యాదిగిరి ఇతనే అంటే నమ్మేశారు…
నటునిగా ప్రేక్షకులు నమ్మారు…టెక్నీషియన్‌గా రాము నమ్మాడు..
అందుకే ఉత్తేజ్ చెప్పాడని తాను రికమండ్ చేశాడని జె.డి చక్రవర్తిని విలన్‌గా పెట్టుకున్నారు…కట్ చేస్తే ఒకే ఒక్క సినిమాతో జె.డి దేశం మొత్తానికి తెలిసిపోయాడు..
అద్భుతాలు జరిగేటప్పుడు ఎవరికి తెలియదు..జరిగాక అక్కడ అద్భుతం జరిగింది అనే చర్చ మాత్రమే ఉంటుంది..అందుకే చాలా అద్భుతాలు చేసేటప్పుడు అది అద్భుతం అని ఎవరు గుర్తించరు. అలాంటి గొప్ప అద్భుతం 1989లో జరిగింది. నూనుగు మీసాలు మూతిమీద రాకుండానే తెలుగు సినిమా పరిశ్రమలో అందరికి యాదగిరి తెలిసిపోయాడు. శివ సినిమాలో పనిచేసినవారందరికి ఎంతో గొప్ప పేరొచ్చింది. ఇండస్ట్రీ గొప్పతనం అదే. ఆ కళామతల్లి ఒక్కసారి ముద్దాడి చంకన ఎక్కించుకుంటే జీవితాంతం పేరొచ్చేస్తుంది. ఆ పేరు 36 ఏళ్లకిందటే ఉత్తేజ్‌కి వచ్చింది. అప్పుడే నటించేశాడు.. ఉత్తేజ్ ఆర్ట్స్‌లో ఫైన్ కానీ మ్యాథ్స్‌లో పూర్..అందుకే లెక్కలకి విలువిచ్చే ఈ ఇండస్ట్రీలో లెక్కల్లో తప్పాడు. ఫైనాన్షియల్‌గా ఎక్కడో ఓ చోట ఆగిపోయాడు. తన ప్లేస్‌లో వేరే వాళ్లుంటే ఎలా ఫీలయ్యేవారో కానీ మనోడు మట్టివాసన దగ్గర ఆగిపోయాడు. అందుకే జేబు గట్టిగా లేకపోయినా కడుపు ఖాళీగా లేకుండా ఉండేంత ఉందిగా అంటాడు నవ్వుతూ…ఆ నవ్వులో ఎన్నో అర్థాలు ఉంటాయి. వెతికేవాళ్లకి వెతికినన్నీ కనిపిస్తాయి. అందుకే ఆ అర్థాలు వెతికి పట్టేవాళ్ల కళ్లల్లోకి డైరెక్టుగా చూడడు. అలా వారెవరూ తన కళ్లల్లోకి చూడకుండా దాక్కుని తిరుగుతాడు. అదో ఆర్టు. వందకు పైగా సినిమాలు చేశాడు. వందేళ్లు తనతో కలిసి ఉంటుందనుకున్న తన పద్దు మధ్యలోనే మిడిల్‌డ్రాప్ అంటే..చిన్న పిల్లాడిలా గుక్కపెట్టి ఏడ్చాడు…ఎన్నో పుస్తకాలు చదివాడు కదా జీవితమంటే ఇంతే అని తనలో తాను సర్దుకోవటం అలవాటు చేసుకుంటున్నా అని చెప్తాడు..అంతలోనే అది ఎంత కష్టమో అని తన మాటల్తో చూపుల్తో అందంగా చెప్పేస్తాడు. జీవితంలో మిగిలిన తన కూతురు పాట కోసం జీవితాన్ని పాటలా ఉంచుకోవాలని పరితపిస్తున్నాడు.
సరిగ్గా ఈ రోజుకు సగం జీవితాన్ని మమ అనుకుంటూ నెట్టేశాడు…అంటే ఈ రోజుతో మన ఉత్తేజ్‌కి 50 ఏళ్లు నిండాయి… తాను ఒక్కడిగా వచ్చి ఎంతమందికి చేయూతనిచ్చారో తనకి మాత్రమే తెలుసు. తన వల్ల లబ్దిపొందిన వారి గురించి అడిగిన చెప్పరు…గప్‌చుప్ అంటాడు. బతకటానికి అప్పుడప్పుడు నచ్చిన వేషాలు వేస్తాడు…మేం నటులవ్వాలి అని వచ్చినవాళ్లకి మాస్టారుగా పనిచేస్తున్నాడు. జీవితం విలువ తెలిసిన వాడు..మనుషుల మీద విపరీతమైన ప్రేమ…చాలా గొప్ప మొమొరీ..నటునికి, రాతగానికి, మాటగానికి మెమొరీ గొప్పవరం. మీరు మీ మెమోరీస్‌తో పదికాలాలపాటు ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ట్యాగ్‌తెలుగు.కామ్ మీకు జన్మదిన శుభాకాంక్షలు తెలియచేస్తుంది మల్టీటాలెంటెడ్ పర్సనాలిటీ ఉత్తేజ్ గారు….
ఆల్ ది వెరీ బెస్ట్ శివమల్లాల
Also Read This :రంగుల ప్రపంచంలో కుంచెపట్టిన బాపు బొమ్మ ఈమె….