మనుషులు రెండు రకాలుంటారు…
మాటల మనుషులు, చేతల మనుషులు…
ఇతను ఒకసారి మాటిచ్చాడంటే మడమతిప్పడు..
చిన్న చిన్న కొండలను తవ్వి ఎలుకను పట్టడు.. హిమాలయాల్ని ఎత్తుకొంటాడు…
అది భారమైన, మోయలేనని తెలిసినా కూడా…
తన ప్రయత్నంలో ఎటువంటి లోపం ఉండదు..
అందరికి స్నేహితుడు..వెయ్యిమందిలో ఉన్న ఒంటరోడు..
పదిమంది కలిసేచోటులో ఒక్క క్షణం ఉండడు..
పదిమందితో పది కాలాలపాటు ఒక్కడై ఒక్కడే ఉంటాడు..
విద్యతో సావాసం వల్ల ఆవాసం ఏర్పరుచుకున్నాడు..
ఎంతోమందికి ఉపాధి కల్పించాడు..
మరెన్నో కుటుంబాల్లో ఆశలకు ఊపిరులూదాడు..
తనవాళ్లందరూ బావుండాలనుకోవటమే కాదు..
వాళ్ల బాగుకోసం ఒక్కోసారి తాను గల్లంతవుతాడు..
కలియుగంలో ఉండటానికి ఆస్కారమే లేని వ్యక్తి..
కోరికలే లేని ఊహలగుర్రమితను….
చదువుల తల్లి కొలువులకు ఐడియాలు అమ్ముతాడు..
కాలేజ్ మెంటార్ కంపెనీ పెట్టి విద్యార్థులకు, విధ్యా సంస్థలకు వారధిలా ఉంటాడు..అందుకే అతను ఏ ప్రోగ్రాం పెట్టినా పది చేతులు ఒకేసారి కలుస్తాయి…నలుగురికి ఉపయోగం ఉంటుంది…
ప్రకటనలకే పరిమితం అవ్వటం అస్సలు చేతకాని వాడు..
పిల్లల భవిష్యత్తుకు కోటి రూపాయలు స్కాలర్‌షిప్ ప్రకటించాడు..
ప్రకటన చూసిన అందరూ ఇస్తాడో లేదో అనుకున్నారు…
అన్నమాట ప్రకారం స్టేజిపైనే కోటి రూపాయలు పంచేశాడు..ఎడ్యుకేషన్ ఇండస్ట్రీ అంతా ముక్కున వేలేసుకున్నారు…తాను మాత్రం కాలు మీద కాలేసుకున్నాడు…మాటంటే ఇచ్చేయాలిగా అంటూ నవ్వేశాడు…నిర్మాతగా తొమ్మిది సినిమాలు చేశాడు.. కానీ తాను నిర్మాత అని ఎవరికి తెలియదు…అందులో గొప్పేముంది అంటూ తీసి పారేస్తాడు..స్నేహితులందరికి తనో నిండువెన్నెల, ఆ వెన్నెల అందరిపై పడుతుంది..తనతో ఉన్న అందరూ వెలుగుతూ ఉంటారు నక్షత్రాల్లా..
తాను మాత్రం అమావాస్య చంద్రుడే..ఎప్పుడు రాహుకేతువులను దగ్గరకు తీసుకుని బలౌతూ ఉంటాడు. (తనే ఎదురెళ్లి బలౌతాడు కాబట్టి ఇందులో ఎవరి తప్పు ఉండదు). తనకే వెలుగులో ఉండటం ఇష్టంలేక అలా చేస్తా అంటాడు నవ్వుతూ..
రాజు ఎక్కడున్నా రాజే…అనే పదానికి నిలువెత్తు నిదర్శనం అతను…
అలాంటి రాజసానికి తోడైంది నక్షత్రం లాంటి స్వాతి…బంగారంలాంటి పాప స్వీటూ…
నాకు తెలిసి ఫోన్ కనిపెట్టినోడికి కూడా తెలియని ఆప్షన్లు రాజాకి తెలుసు…మనోడు పెద్ద సైంటిస్ట్ అనుకుంటారేమో..
ఫోన్ కనిపెట్టినోడు కూడా అన్నిసార్లు ఫోన్ స్విఛాఫ్ చేసి ఉండడు… అది తన స్పెషాలిటీ..సగంలోనే ఫోన్ పెట్టేస్తాడు…అందుకే కలియుగానికి ఇతనికి అస్సలు పోలికే ఉండని మనిషి అన్నది..అతనే రాజశేఖర్ రెడ్డి…
తెలుగు, తమిళ సినిమాల నిర్మాత, కాలేజ్ మెంటార్ ఫౌండర్ రాజశేఖర్ రెడ్డి…అందుకే ఆయనకు మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు తెలియచేస్తుంది ట్యాగ్‌తెలుగు.కామ్ మరియు శివమ్ మీడియా…హ్యాపీ బర్త్‌డే టు డియర్ రాజా….
శివమల్లాల
Also Read This : పవన్‌కళ్యాణ్ గారికి రాసిన పాటతో పద్నాలుగేళ్ల యుద్ధాన్ని జయించాను