కామెడికింగ్ బ్రహ్మానందం జన్మదినం నేడు. గతంలో నెలకు 15 సినిమాలు విడుదలైతే అందులో 8 సినిమాల్లో ఖచ్చితంగా ఆయనుండేవారు. అటువంటిది చాలకాలం నుండి సినిమాలు చేయటం పూర్తిగా తగ్గించేశారు. ప్రశాంతంగా ఉంటూ ఎప్పుడో ఒక సినిమాలో అలా తళుక్కున మెరుస్తూ కనిపిస్తున్నారాయన. ఆయన కనిపించింది ఒక్క నిమిషం అయినాకూడా ఆ కాసేపు ఎంజాయ్ చేస్తున్నారు బ్రహ్మానందం టాలెంట్ తెలిసిన ప్రేక్షకులు. 2025 పుట్టినరోజు మాత్రం బ్రహ్మానందం కెరియర్లో ముఖ్యమైన పుట్టినరోజుగా మిగిలిపోతుంది. దానికి కారణం ఆయన తాతగా తన కొడుకు రాజాగౌతమ్ మనవడిగా ఆర్.వి.యస్ నిఖిల్ దర్శకత్వంలో స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా ఎంతో ప్రెస్టీజియస్‌గా నిర్మిస్తోన్న చిత్రం ‘బ్రహ్మానందం’ తెరకెక్కుతుంది.

ఇప్పటికే సినిమా ప్రమోషన్ ప్రారంభం అయ్యింది. అక్కడక్కడ బ్రహ్మానందం కనిపించి కనిపించగానే మనసులోనే ఒక్క నిమిషం పాటు ప్రతి ఒక్క ప్రేక్షకుడు అనుకుంటున్నాడు, ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందా ఆయన ఎలా చేసి ఉంటారా? అని సినిమా గురించి ఆరా తీస్తున్నారు. సక్సెస్‌ఫుల్ సినిమాలను అందించే క్లాసికల్ స్టోరీ టెల్లర్ నిర్మాత రాహుల్ ఒక పథకం ప్రకారమే సినిమాలను నిర్మించే సంగతి అందరికి తెలుసు. అందుకే ప్రతి ఒక్కరూ బ్రహ్మానందం సినిమా ఎప్పుడు విడుదలవుతుందా అని వేచి చూస్తున్నారు. ఈ చిత్రంలో తాత చేసే పనులకు విసుగొచ్చే మనవళ్లకు ఓ తీయని అనుభూతిలా ఉంటుందని అంటున్నారు. ‘వెన్నెల’ కిశోర్, ప్రియ వడ్లమాని ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ‘బ్రహ్మానందం’ సినిమా బ్రహ్మానందానికి తీయని గుర్తుగా మిగలాలని కోరుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు తెలియచేస్తుంది ట్యాగ్‌తెలుగు.కామ్.
శివమల్లాల
Also Read This :మ్యాజిక్ ఫుల్ మరి లాజిక్ మాటేంటి?