‘ప్రొడక్షన్ నం 1’ షూటింగ్ పూర్తి చేసిన సోనుధి ఫిలిం ఫ్యాక్టరీ

సోనుధి ఫిలిమ్‌ ఫ్యాక్టరీ అధినేత ఆర్‌.యు రెడ్డి అన్నమాట ప్రకారం తాను ప్రారంభించిన ప్రొడక్షన్‌ నం1 సినిమా షూటింగ్‌ను దిగ్విజయంగా పూర్తి చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. ‘‘ఇదొక కొత్త రకమైన సినిమా. అనేక ఎమోషన్స్‌ కలగలిసిన కథ. మంచి కథ కావటంతో మా నటీనటులు ఆశిష్‌గాంధీ, మానస రాధాకృష్ణన్‌ల నుంచి ఎంతో చక్కని సహకారం లభించింది. ఈ సినిమాను అనుకున్న సమయానికి షూటింగ్‌ పూర్తి చేయగలిగాం. మా దర్శకులు కిరణ్‌ కిట్టి, లక్ష్మీ చైతన్యలు కొత్తవారైనా చెప్పిన కథను చెప్పినట్లు తెరకెక్కించారు. ఒక్క పాట మినహా షూటింగ్‌ పార్టంతా పూర్తయింది. ఆ పాటను ప్రముఖ కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌ చేయనున్నారు. త్వరలోనే సినిమా టైటిల్‌, ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను విడుదల చేస్తాం. సినిమాను రెండు నెలల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాం. ప్రముఖ సంగీత దర్శకుడు గోపిసుందర్‌ అందించిన ఆరు పాటలు మా సినిమాకు హైలెట్‌గా నిలుస్తాయి. మా బ్యానర్‌ నుంచి మరికొన్ని సినిమాలు ఈ ఏడాదిలో ప్రారంభిస్తాం’’ అన్నారు.

 శివమల్లాల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *