అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం ‘పరదా’. ఈ చిత్రంలోని పాటను, రిలీజ్ డేట్‌ను నేడు మేకర్స్ ప్రకటించారు. ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని జయ్ డొంకాడ, శ్రీనివాసులు పీవీ, శ్రీధర్ మక్కువ నిర్మిస్తున్నారు. దీనికి సంబంధించిన కార్యక్రమంలో అనుపమ పరమేశ్వరన్, హీరో సత్యదేవ్, దర్శకుడు ప్రవీణ్ కండ్రేగుల తదితరులు పాల్గొన్నారు. ఒకప్పుడు స్త్రీ ‘పరదా’ మాటున ఉంటూ ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొందో ఈ చిత్రం తెలియజేస్తోంది. ఈ సినిమా ఆగస్ట్ 22న విడుదల కానుంది. ఈ సందర్భంగా విడుదలైన పాట ‘’యత్ర నార్యస్తు పూజ్యంతే, రమంతే తత్ర దేవతాః’ అంటూ సాగుతూ ఆకట్టుకునేలా ఉంది. స్త్రీ గొప్పతనాన్ని చెబుతూ లిరిక్స్ అద్భుతంగా ఉంటాయి. వనమాలి అందించిన లిరిక్స్ పాటకు హైలైట్ అని చెప్పాలి. అనురాగ్ కులకర్ణి పాటను అద్భుతంగా ఆలపించారు.
ప్రజావాణి చీదిరాల