డంప్‌యార్డులో 7 గంటల పాటున్నా రష్మికకు వాసన రాలేదట..

సూపర్ స్టార్ ధనుష్, కింగ్ నాగార్జున, రష్మిక మందన్న, శేఖర్ కమ్ముల కాంబోలో రూపొందిన చిత్రం ‘కుబేర’. శేఖర్ కమ్ముల అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా తెలుగు, తమిళం, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషలలో జూన్ 20న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రంలోని ‘పీ పీ డుమ్‌ డుమ్‌’ పాటని ముంబయిలో గ్రాండ్ గా లాంచ్ చేశారు.

సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో హీరో ధనుష్ మాట్లాడుతూ… ‘‘కుబేర చాలా స్పెషల్, డిఫరెంట్ ఫిలిం. నా మనసుకు చాలా దగ్గరైన సినిమా. ఈ సినిమా షూటింగ్ ఫెంటాస్టిక్ ఎక్స్పీరియన్స్. నాగార్జున గారితో కలసి వర్క్ చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఈ సినిమాలో బెగ్గర్ క్యారెక్టర్ ని ప్లే చేశాను. ఈ పాత్ర కోసం ఎంతో రీసెర్చ్‌, హోమ్‌ వర్క్‌ చేశా’ అని చెప్పను (నవ్వుతూ). మా డైరెక్టర్ గారిని ఫాలో అయ్యాను. శేఖర్ గారు బ్రిలియంట్ డైరెక్టర్. ఇలాంటి క్యారెక్టర్ ని నేను ఇప్పటివరకు చేయలేదు. ఓ డంప్‌యార్డ్‌లో దాదాపు 7 గంటలపాటు నేను, రష్మిక షూటింగ్‌లో పాల్గొన్నాం. అక్కడ అంతసేపు ఉన్నా ఆమె బాగానే ఉంది. ‘నాకేం వాసన రావట్లేదు’ అని చెప్పింది. మరి ఆమెకు ఏమైందో నాకు తెలియదు (నవ్వుతూ). ఇలా ఎన్నో మంచి జ్ఞాపకాలు పంచిందీ కుబేర’’ అన్నారు.

నాగార్జున మాట్లాడుతూ.. ‘‘కుబేర నాకు చాలా స్పెషల్ ఫిలిం. ఏదైనా డిఫరెంట్ గా చేయాలి అనుకున్నప్పుడు శేఖర్ వచ్చారు. ఆయనతో గత 15 ఏళ్లుగా పని చేయాలని అనుకుంటున్నాను. ఆయన ఈ సినిమా గురించి చెప్పినప్పుడు మరో ఆలోచన లేకుండా ఓకే చేశాను. శేఖర్ బ్రిలియంట్ ఫిలిం మేకర్. తన సెన్సిబిలిటీస్ అద్భుతంగా ఉంటాయి. తన మనసు చాలా స్వచ్ఛంగా ఉంటుంది. అది స్క్రీన్ మీద కనిపిస్తుంది. జిమ్ సర్బ్ తో కలిసి పనిచేయడం మంచి ఎక్స్పీరియన్స్. తెలుగు చాలా చక్కగా మాట్లాడారు. రష్మిక పవర్ హౌస్ ఆఫ్ టాలెంట్. తన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్స్ అవుతున్నాయి. ధనుష్ బ్రిలియంట్ యాక్టర్. ఈ సినిమాలో అద్భుతంగా చేశారు’’ అన్నారు

హీరోయిన్ రష్మిక మందన మాట్లాడుతూ.. ‘‘ఒక నటిగా కుబేర సినిమా నాకు చాలా అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. ఇది ఐ ఓపెనర్ లాంటి సినిమా. అన్నీ కూడా రియల్ లొకేషన్స్ లో షూట్ చేయడం జరిగింది. నాగార్జున సర్ , ధనుష్‌ గారితో కలిసి నటించడం ఆనందంగా ఉంది. శేఖర్ గారితో వర్క్ చేయడం మంచి ఎక్స్పీరియన్స్’’ అన్నారు. యాక్టర్ జిమ్ సర్భ్ మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమాల్లో మోస్ట్ ఆఫ్ ది సీన్స్ నాగార్జున గారితో చేశాను. ఆయనతో వర్క్ చేయడం గ్రేట్ ఎక్స్పీరియన్స్. డైరెక్టర్ గారు నా క్యారెక్టర్ గురించి చెప్పినప్పుడే నాకు చాలా నచ్చేసింది. ఈ సినిమా కోసం తెలుగు నేర్చుకోవడం అనేది చాలా చాలెంజింగ్ గా అనిపించింది’’ అన్నారు.

ప్రజావాణి చీదిరాల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *