బిగ్ బాస్ సోహెల్ తీరుపై ప్రేక్షకుల విస్మయం
Sohel Bootcut Balaraju : సినీ ప్రియులు ఏదైనా సినిమా చూడాలంటే ఏం కావాలి? ఆ సినిమాలో వారు కోరుకుంటున్న అంశాలు ఉండాలి.
అవి ఉన్న సినిమాకి పెద్దగా ప్రచారం కూడా అవసరం లేకుండానే ప్రేక్షకులు ఎగబడతారు. విషయం లేని సినిమాకు ఎంతగా
ప్రచారం కల్పించినా ప్రయోజనం ఉండదు. ఒక్కోసారి మంచి సినిమాను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విఫలమైనా అదే పరిస్థితి ఎదురువుతుంది.
అయితే మంచి సినిమాను ప్రేక్షకులకు చేరువ చేసేందుకు పలురకాల పద్ధతులు ఉంటాయి. కానీ, ‘నా సినిమూ చూడండన్నా’ అంటూ
ఒక హీరో ప్రేక్షకులను బతిమిలాడుకోవడం ఎప్పుడైనా చూశామా? తొలిసారిగా బిగ్ బాస్ ఫేమ్ సోహెల్ ఇలా బతిమిలాడుకుంటున్నాడు.
ఈ వారమే అతడు ‘బూట్ కట్ బాలరాజు’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాకి అంతగా ప్రేక్షకులు
రాకపోవటంతో, సోహెల్ కళ్లనీళ్లు పెట్టుకొని తన సినిమా చూడమని అందరినీ వేడుకుంటున్నాడు. ఈ వీడియో ఇప్పుడు సామాజిక
మాధ్యమాల్లో వైరల్ అయింది. బిగ్ బాస్ ఇంట్లోకి వచ్చి బాగా పాపులర్ అయిన నటుల్లో సోహెల్ ఒకడు. అతను బయటకి వచ్చాక
సినిమా కెరీర్ మొదలుపెట్టి సినిమాలు చేస్తూ వస్తున్నాడు. గత సంవత్సరం ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ అనే సినిమా చేసి అందరి ప్రసంశలు
పొందాడు. ఈ వారం అతని సినిమా ‘బూట్ కట్ బాలరాజు’ విడుదలైంది, ఈ సినిమాతో అతను నిర్మాతగా కూడా మారాడు.
కమెడియన్ సునీల్ ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్రలో కనపడగా
శ్రీనివాస్ కోనేటి ఈ సినిమాకి దర్శకుడు, ఇందులో మేఘలేఖ కథానాయకురాలు, ఇంకో బిగ్ బాస్ ఫేమ్ సిరి హనుమంత్ కూడా
ఇంకో కథానాయికగా కనపడుతుంది. కమెడియన్ సునీల్ ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్రలో కనపడగా, సీనియర్ నటి ఇంద్రజ
ముఖ్యపాత్రలో కనపడింది. ఈ సినిమా శుక్రవారం విడుదలైంది. అయితే ఈ సినిమాకి అటు విమర్శకుల నుండి గానీ, ఇటు
ప్రేక్షకుల నుండి గానీ అంత స్పందన లభించలేదు. నిన్న ఒక మల్టిప్లెక్స్ లో ఈ సినిమా చూడటానికి సోహెల్ వచ్చాడు.
సినిమా అయ్యాక బయటకి వచ్చి కళ్ళనీరు పెట్టుకొని తన సినిమా చూడమని అందరికీ విజ్ఞప్తి చేసాడు. “బిగ్ బాస్ లో వున్నప్పుడు
వేలకొద్దీ కామెంట్స్ సోహెల్, సోహెల్ అంటూ పెట్టారు కదన్నా. ఇప్పుడేమైందన్నా, అందరూ వెళ్లండన్నా నా సినిమాకి.
చూడండన్నా నా సినిమాని,” అని వేడుకుంటూ కన్నీటి పర్యంతమయ్యాడు. పక్కనే వున్న అవినాష్.. సోహెల్ ని ఊరడిస్తూ కనిపించాడు.
తాను ఒక మంచి సినిమా తీశానని, కుటుంబ సభ్యులదరితో చూసే విధంగా తన ‘బూట్ కట్ బాలరాజు’ సినిమా ఉంటుందని, అందుకే
అందరూ వెళ్లి చూడాలి అని సోహెల్ వేడుకున్నాడు. “ముద్దు పెట్టే సీన్స్ చేసి చూపించాలా,” అని వాపోయాడు.
తాను అలాంటి సినిమా చెయ్యలేదని, చెల్లితో, అక్కతో, తమ్ముడు, చిన్నపిల్లలతో చూసే సినిమా చేశానని, అలాగే
ఈ సినిమాకి ఉన్నదాంట్లో ఎంత చెయ్యాలో అంత చేశానని చెప్పుకొచ్చాడు. ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల్లో
అందరూ థియేటర్ కి వెళ్లి తన సినిమా చూడాలని ఏడుస్తూ విజ్ఞప్తి చేసాడు. పక్కన వున్న అవినాష్ శనివారం, ఆదివారం
వీకెండ్ వస్తోంది, అందరూ చూస్తారు నీ సినిమాని అని సోహెల్ ని సముదాయించాడు. కానీ, ఈ సోహెల్ ఏడుస్తున్న
వీడియో చూసిన వారు మాత్రం విస్మయం వ్యక్తం చేస్తున్నారు. తన సినిమాలో ఏం ఉందో చెప్పుకోకుండా.. ఏడిస్తే సినమాలు చూస్తారా? అని
వ్యాఖ్యానిస్తున్నారు.
Also Read:poonam panday news : బతికే ఉన్నానంటూ వీడియో షేర్ చేసిన నటి
