Sampoornesh Babu: ఫన్, ఎమోషన్ కలబోతగా ‘సోదరా’.. ట్రైలర్ వచ్చేసింది

సంపూర్ణేశ్‌బాబు (Sampoornesh Babu), సంజోశ్‌ (Sanjosh) అన్నదమ్ములుగా నటించిన సినిమా ‘సోదరా (Sodara)’. మన్మోహన్‌ మేనంపల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆర్తి, ప్రాచి బన్సాల్‌ హీరోయిన్లుగా నటించారు. కేన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై చంద్ర చాగన్ల ఈ చిత్రాన్ని నిర్మించారు.
ఈ నెల 25న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్‌ను మేకర్స్ ప్రారంభించారు. ఇవాళ (గురువారం) సినిమా ట్రైలర్‌‌ను విడుదల చేశారు. ట్రైలర్ ఆద్యంతం నవ్వించింది. అన్నదమ్ముల అనుబంధాన్ని ఈ ట్రైలర్‌లో హైలైట్ చేశారు. ఇద్దరూ కలిసి ఒకే అమ్మాయిని ప్రేమించడం.. ఆ తరువాత అన్న కోసం తమ్ముడు ఏం చేయడానికైనా వెనుకాడకపోవడం వంటి అంశాలను ట్రైలర్‌లో చూపించారు. ఫన్, ఎమోషన్ కలబోతగా ఈ ట్రైలర్ ఉంది. ట్రైలర్‌ను చూస్తే సంపూ గత సినిమాలకు ఇది భిన్నంగా ఉంటుందని మాత్రం అర్థమైంది.

ప్రజావాణి చీదిరాల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *