ఒక్క సినిమా చాలు.. లైఫ్‌ని టర్న్ చేయడానికి.. అలాగే రెమ్యూనరేషన్ అమాంతం పెరగడానికి. ఒక్క సినిమాతోనే అలా ఉంటే.. వరుస సక్సెస్‌లతో దూసుకెళుతున్న వారి పరిస్థితేంటి? రెమ్యూనరేషన్ అమాంతం పెరుగుతుంది. ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ శివ కార్తికేయన్ పరిస్థితి ఇదే. గత ఏడాది ‘అమరన్’ చిత్రంతో శివ కార్తికేయన్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఈ సినిమా రూ.300 కోట్లు కలెక్ట్ చేసింది. ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తున్నాడు. మురుగదాస్ దర్శకత్వంలో ‘మదరాసి’, సుధా కొంగర దర్శకత్వంలో ‘పరాశక్తి’ సినిమాలతో శివకార్తికేయన్ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. మురుగదాస్ అయితే వరుస ఫ్లాపులతో కొట్టుమిట్టాడుతున్నారు.
‘సికిందర్’ అయినా మురుగదాస్‌ను నిలబెడుతుందేమో అనుకుంటే అది కూడా డిజాస్టర్. అలాంటి మురుగదాస్‌తో చేస్తూ కూడా సినిమా సక్సెస్‌పై శివ కార్తికేయన్ ఫుల్ కాన్ఫిడెన్స్‌తో ఉన్నాడు. ఇక పరాశక్తి ప్లానింగ్ కూడా ఓ రేంజ్‌లో ఉంది. ఈ సినిమా పిరియాడిక్ స్టూడెంట్ డ్రామాగా రూపొందుతోంది. అయితే ఈ సినిమాల కోసం శివకార్తికేయన్ తన రెమ్యూనరేషన్‌కు దాదాపు నాలుగు రెట్లు ఎక్కువగా తీసుకుంటున్నాడని సమాచారం. గత సినిమాలకు రూ.10 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్న శివకార్తికేయన్.. ప్రస్తుతం రూ.35 కోట్ల రెమ్యూనరేషన్ తీసునకుంటున్నాడని తెలుస్తోంది. ఇక ‘మదరాసి’ చిత్రం ఈ ఏడాది సెకండాఫ్‌లోనూ.. ‘పరాశక్తి’ వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది.
ప్రజావాణి చీదిరాల