సైలెంట్‌గా ఓటీటీలోకి ‘#సింగిల్‌’.. ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోందంటే..

శ్రీవిష్ణు ప్రధాన పాత్రలో నటించిన సరికొత్త చిత్రం ‘#సింగిల్‌’. కేతిక శర్మ, ఇవానా కథానాయికలుగా నటించిన ఈ చిత్రాన్ని కార్తీక్ రాజు తెరకెక్కించారు. వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలో నటించిన ఈ కామెడీ, రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ వేసవి కానుకగా మే నెలలో విడుదలై ప్రేక్షకులను అలరించింది. ఈ సినిమా సైలెంట్‌గా ఓటీటీలోకి అడుగు పెట్టింది. అమెజాన్ ప్రైమ్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా కథేంటంటే.. విజయ్‌ (శ్రీవిష్ణు), అతని మిత్రుడు అరవింద్‌ (వెన్నెల కిషోర్‌) ఇద్దరూ ఎస్‌డీఎఫ్‌ బ్యాంక్‌లో ఇన్స్యూరెన్స్‌ విభాగంలో పని చేస్తుంటారు.

అరవింద్ ఓ అమ్మాయిని ప్రేమిస్తుంటాడు. వీరిద్దరి ప్రేమ విషయంలో అరవింద్‌కు సాయం చేసే క్రమంలో పూర్వను చూసిన విజయ్ ప్రేమలో పడిపోతాడు. పూర్వ వెంట ప్రేమ పేరుతో విజయ్ వెంట పడుతుంటే.. అతని వెంట హరిణి (ఇవానా) పడుతుంది. ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ చివరకు ఎలాంటి మలుపు తీసుకుంది? ఈ ఇద్దరిలో విజయ్ ఎవరికి దక్కుతాడు? లేదంటే ఎవరి ఊహలకు అందకుండా మరేదైనా వీరి కథలో ట్విస్ట్ చోటు చేసుకుందా? తెలియాలంటే ‘సింగిల్’ మూవీ చూడాల్సిందే.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *