Siddu Jonnalagadda :
సిద్దు జొన్నలగడ్డ, బొమ్మరిల్లు భాస్కర్ కాంబోలో వచ్చిన చిత్రం ‘జాక్’. ఈ సినిమాలో వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా నటించింది.
ఈ సినిమా ఈ నెల 10వ తేదీన విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో గురువారం జరిగింది.
అయితే ట్రైలర్‌లో కొన్ని సన్నివేశాల్లో అభ్యంతరకర పదాలను వాడటం జరిగింది.
ఈ విషయమై ఈవెంట్‌లో సిద్దుని మీడియా ప్రశ్నించగా తనదైన స్టైల్లో సమాధానం ఇచ్చాడు.
‘సినిమాలో బూతులు కూడా బాగా వాడినట్టున్నారు?’ అని మీడియా ప్రశ్నించగా.. ‘అవునండీ’ అంటూ సిద్ధు సమాధానమిచ్చాడు.
ఎందుకు వాడారు? అంటే ఆ డైలాగ్ అక్కడ వాడాలనిపించింది అందుకే వాడానని సిద్దు తెలిపాడు.
‘జనాలు అలాంటి వాటిని ఎలా అంగీకరిస్తారనుకుంటున్నారు?’ అని మీడియా ప్రశ్నించగా.. ‘నేనంత ప్లానేం చేయలేదు.
అక్కడ హీరో క్యారెక్టర్‌కి ఆ పాయింట్ ఆఫ్ టైమ్‌లో ఉన్న ఎమోషన్‌కి కరెక్ట్ అనుకుని చేశాం’ అని సిద్ధు సమాధానమిచ్చాడు.
‘సెన్సార్ అయ్యిందా?’ అని ప్రశ్నించగా తెలియదని సిద్దు చెప్పాడు.
హీరోకు సెన్సార్ అయ్యిందో లేదో కూడా హీరోకు? అని ప్రశ్నించగా.. ‘తెలియదు సర్.. సారీ’ అని సిద్ధు చెప్పాడు.
ప్రజావాణి చీదిరాల
Also Read This : సిద్దుని నమ్మి సీన్ చెప్పి కళ్లు మూసుకుంటే చాలు: బొమ్మరిల్లు భాస్కర్