ఫిబ్రవరి 15 న సిద్ శ్రీరామ్ లైవ్ కాన్సర్ట్… ఎక్కడంటే…?

గీతాగోవిందం సినిమాలోని ఇంకేం ఇంకేం కావాలే సాంగ్ తో ఒక్కసారిగా స్టార్ట్ సింగర్ మారిన సిద్ శ్రీరామ్. తరువాత ఎన్నో సూపర్ హిట్స్ సాంగ్స్ ను మనకు అందించాడు.

ఇదిలా ఉండగా సిద్ శ్రీరామ్ హైదరాబాద్లో లైవ్ కాన్సర్ట్ నిర్వహించబోతోన్నాడు. ఫిబ్రవరి 15న ఈ లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్ ని మూవ్78 లైవ్ సంస్థ ప్లాన్ చేసింది.

ఈ కాన్సర్ట్ విశేషాల్ని తెలియజేసేందుకు మూవ్ 78 లైవ్ సంస్థ సీఈవో నితిన్ కనకరాజ్, సింగర్ సిధ్ శ్రీరామ్ మీడియా ముందుకు వచ్చారు.

ప్రెస్ మీట్ లో దానికి సంబంధించిన విషయాలు పంచుకున్నారు.

సింగర్ సిధ్ శ్రీరామ్ మాట్లాడుతూ : ‘గత పదేళ్ల నుంచి తెలుగు ఆడియెన్స్ ఎంతో ప్రేమను కురిపిస్తూనే ఉన్నారు. నాకు తెలుగులోనే ఎక్కువ మంది అభిమానులున్నారు.

మూడేళ్ల క్రితం హైదరాబాద్లో లైవ్ కాన్సర్ట్ చేశాను. మళ్లీ ఇప్పుడు చేయబోతోన్నాం.

ఈ కాన్సర్ట్లో నా పాటలతో పాటుగా 80, 90లో వచ్చిన మెలోడీ పాటల్ని కూడా పాడతాను.

నేను ప్రస్తుతం తెలుగు నేర్చుకుంటున్నాను. నాకు ఓ ఏడాది టైం ఇవ్వండి తెలుగులో పూర్తిగా మాట్లాడేందుకు ప్రయత్నిస్తాను’ అని అన్నారు.

నితిన్ కనకరాజ్ మాట్లాడుతూ : ‘సిధ్ శ్రీరామ్ తో మూడేళ్ల తరువాత మళ్లీ హైదరాబాద్లో లైవ్ కాన్సర్ట్ నిర్వహిస్తున్నాం. ఫిబ్రవరి 15న ఈ ఈవెంట్ను నిర్వహించబోతోన్నాం.

ఈ కాన్సర్ట్ ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్ కోసం, యూత్ కోసం ఏర్పాటు చేస్తున్నాం.

నాకు పర్సనల్గా సిధ్ శ్రీరామ్ అంటే చాలా ఇష్టం.

ఈ జనరేషన్ కి సిధ్ అంటే చాలా ఇష్టం. ఈ ఈవెంట్, లైవ్ కాన్సర్ట్ అద్భుతంగా ఉండబోతోంది.

గ్రూపుగా టికెట్లు బుక్ చేసుకుంటే డిస్కౌంట్ కూడా ఉంటుంది’ అని అన్నారు.

సంజు పిల్లలమర్రి

Also Read This : టాలీవుడ్ అగ్ర నిర్మాతల ఇళ్లలో ఐటీ దాడులు

Actor Ananda Chakrapani Inspiring Interview
Actor Ananda Chakrapani Inspiring Interview

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *