సమంత నిర్మాణంలో ‘శుభం’.. మూవీ ట్రైలర్ ఎలా ఉందంటే..

సమంత సొంత నిర్మాణ సంస్థ ట్రా లా లా మూవింగ్ పిక్చర్స్ పతాకంపై నటి-నిర్మాత సమంత నిర్మించిన తొలి చిత్రం ‘శుభం’. ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. సమంత సొంత నిర్మాణంలో రూపొందిన చిత్రం అనగానే దీనిపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇప్పటి వరకూ రిలీజ్ చేసిన పోస్టర్లు, టీజర్ ఇలా అన్నీ కూడా ఇంట్రెస్ట్‌ను క్రియేట్ చేశాయి. ప్రస్తుతం సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో చిత్ర యూనిట్ అంతా బిజీబిజీగా గడిపేస్తోంది. ఈ క్రమంలోనే ఈ సినిమా నుంచి తాజాగా ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు.

‘శుభం’ ట్రైలర్‌ను బట్టి కథేంటంటే.. ఊళ్లోని మహిళలంతా కూడా సీరియల్‌‌కు అడిక్ట్ అయిపోయి వింతగా ప్రవర్తిస్తుంటారు. సీరియల్ చూస్తున్న తరుణంలో టీవీ కట్ చేస్తే దెయ్యం పట్టినట్టుగా మహిళలు ప్రవర్తిస్తుంటారు. వారి నుంచి తప్పించుకునేందుకు ఊళ్లోని పురుషులంతా కూడా అష్టకష్టాలు పడుతుంటారు. అలాంటి తరుణంలో మాతాజీగా సమంత స్పెషల్ అప్పియరెన్స్ ఇస్తుంది. మొత్తానికి సమంత ఎంట్రీ ఇచ్చి ట్రైలర్‌ మీద మరింత ఇంట్రెస్ట్ కలిగేలా చేసింది. ట్రైలర్‌ను బట్టి సినిమాలో కామెడీ, హారర్ రెండూ మిక్స్ అయినట్టుగా అనిపిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *