ఇంత గొప్ప ప్రయాణాన్ని అస్సలు ఊహించలేదు…

సినిమామీద వ్యామోహం ఉండే ఎవరికైనా ఒక్క ఛాన్స్‌ వస్తే చాలు అని కలలు కంటుంటారు. అలాంటిది తాను ఏ రోజు ఎక్కడా కూడా ఛాన్స్‌ కోసం వెంపర్లాడలేదు. డిగ్రీ తర్వాత ఏదో ఒక పని చేయాలి కాబట్టి సినిమా పరిశ్రమకు వచ్చారట. టార్గెట్‌ లేదు, ఏం చేయాలో క్లారిటీ అస్సలులేదు. అసిస్టెంట్‌ డైరెక్టర్‌ టర్న్‌డ్‌ యాక్టర్‌ టర్న్‌డ్‌ నిర్మాత అవ్వటం అంటే చిత్ర పరిశ్రమలో మామూలు విషయం కాదు. ఇప్పటికే నటునిగా 400 సినిమాలు పైగా నటించారు ఈ క్యారెక్టర్‌ నటుడు. రెండు మూడు సార్లు దర్శకునిగా అవకాశం వచ్చిన సున్నితంగా తిరస్కరించానని దానికి పెద్దగా కారణాలేమి లేవని హాయిగా నవ్వుతూ చెప్పాడు. ఆర్జీవి దర్శకత్వం వహించిన ‘గాయం’, కృష్ణవంశీగారు దర్శకత్వం వహించిన ‘గులాబి’, తేజగారు దర్శకత్వంలో తాను నటించిన ‘నువ్వునేను’ చిత్రాలతోపాటు కొరటాల శివగారు దర్శకత్వం వహించిన ప్రతి చిత్రంలోను చక్కని అవకాశాలు ఇచ్చారని చెప్పుకొచ్చారు ఈ నటుడు. లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌ అంటూ సినిమా పరిశ్రమలోని తన నటీనటుల గురించి ఎంతో గొప్పగా చెప్పుకొచ్చారు ఈ నటుడు. చిరంజీవిగారు, వెంకటేశ్, నాగార్జున ఎక్కడ కనిపించిన హాయ్‌ బెనర్జీ రా ఇలా వచ్చి కుర్చో అంటూ ఎంతో ఆప్యాయంగా పలకరిస్తారని తనకు ఇంతకంటే పెద్ద ఆశలు ఏం లేవన్నారు. అమితాబ్‌ గారు నువ్వు దర్శకునిగా చేయ్‌ నేను నీకు సినిమా చేస్తాను అన్నారు. నా తండ్రి సమానులు అట్లూరి పూర్ణచంద్రరావుగారు బెనర్జీ నువ్వు దర్శకునిగా మారితే నీకు 5 సినిమాలు అవకాశం ఇస్తా అన్నారు. ఎందుకో కాని అవన్నీ చేయాలని అనుకోలేదు అంటూ సినిమాల గురించి తన వ్యక్తిగత జీవితం గురించి అనేక విషయాలను ట్యాగ్‌తెలుగు యూట్యూబ్‌ పాడ్‌కాస్ట్‌లో పంచుకున్నారు బెనర్జీగారు. ఇంటర్వూ బై శివమల్లాల

 

Also Read This :ఆ వార్తలు చూసి అల్లు అర్జున్, నేనూ షాక్ అయ్యాం

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *