...

Satya Movie Review : సమీక్ష– సత్య సినిమా

Satya Movie Review :

విడుదల తేది : 10–05–2024
నటీనటులు : హమరేశ్, ప్రార్ధనా సందీప్, ‘ఆడుగాలం’ మురుగదాస్, సాయిశ్రీ, అక్షయ తదితరులు
ఎడిటర్‌ : కె .సత్యనారయణ
సినిమాటోగ్రఫీ : ఐ.మరుదనాయగం
సంగీతం : సుందరమూర్తి కె.వి
నిర్మాత : శివమల్లాల
దర్శకత్వం : వాలీ మోహన్‌దాస్‌

కథ :

హీరో సత్యమూర్తి గవర్నమెంట్‌ కాలేజిలో ప్లస్‌ వన్‌ చదువుకుంటూ ఆడుతూ, పాడుతూ హాయిగా తిరిగే టీనేజ్‌ కుర్రాడు.

అనుకోకుండా ఓ రోజు స్టూడెంట్స్‌ క్రికెట్‌ ఆడుకుంటుంటే వాళ్లల్లో వాళ్లకి జరిగిన గొడవల్లో పిల్లలందరూ పిచ్చిపిచ్చిగా కొట్టుకుంటారు.

హీరో సత్య వాళ్లందర్ని తప్పించుకునే క్రమంలో రోడ్డు మీదకు వచ్చి తప్పించుకునే ప్రయత్నంలో ఆ ఏరియా పోలీసులకు తగలటంతో పిల్లల్ని అరెస్ట్‌ చేసి పోలీస్‌ స్టేషన్‌కు తీసుకువెళతారు.అప్పుడు హీరో అమ్మ, నాన్న, అక్క అందరూ పరుగు పరుగున పోలీస్‌స్టేషన్‌కి వెళతారు.

సత్య నాన్న ‘ఆడుగాలం’ మురుగదాస్‌ బాగా చదువుతూ మార్కులు తెచ్చుకునే సత్య చెడు సవాసాల వల్లే పోలీస్‌స్టేషన్‌ మెట్లు ఎక్కవలసి వచ్చింది

అనుకుని అర్జెంట్‌గా తను చదివే గవర్నమెంట్‌ కాలేజీనుండి సత్యను మార్చాలని తండ్రిగా తన ప్రయత్నాలు మొదలెడతాడు.

గవర్నమెంట్‌ కాలేజీలో ఏ ఫీజలు కట్టే పనిలేకుండా వాళ్లు నివాసముండే బస్తీలో చాకలి పనిచేసుకుంటూ హాయిగా సాగిపోతున్న తమ జీవితాల్లోకి ప్రైవేట్‌ కాలేజి, ఫీజులు అనేవి తెలియకుండానే ఎంటర్‌ అయిపోతాయి.

సత్యకి తను చదివే కాలేజి, ఫ్రెండ్స్‌ని వదిలి వెళ్లటం ఇష్టం ఉండదు. కానీ అమ్మ,నాన్న కోసం సరే అంటాడు. అక్కడనుండి తను ఓ రిచ్‌ ప్రైవేట్‌ కాలేజికి వెళ్తాడు.

అక్కడ తన కు పార్వతి (ప్రార్ధన సందీప్‌) పరిచయమవుతుంది. వాళ్లిద్దరి మధ్య ఏం జరిగింది? ఎలాంటి స్టూడెంట్స్‌తో కలిసి సత్య చదువుకున్నాడు?

టీచర్స్‌ తనను ఎలా చూశారు? ఇష్టం లేకుండా చేరిన కాలేజితో తనకున్న అనుబంధం ఏంటి? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానం తెరమీదే దొరుకుతుంది.

నటీనటుల పనితీరు :

హీరో హమరేశ్, సీనియర్‌ యాక్టర్‌ ఆడుగాలం మురుగదాస్‌ పోటా పోటిగా నటించారు. తండ్రి, కొడుకులతో పాటు అమ్మ,అక్క పాత్రలు కూడా ఎంతో హృద్యంగా అనిపించాయి.

తండ్రి కొడుకుల మధ్యలో ఉండే బ్యూటిఫుల్‌ ఎమోషన్స్‌తో పాటు కొడుకును ఎవరన్న ఏమన్నా అంటే తట్టుకోలేని తండ్రి పాత్రలో మురుగదాస్‌ నటించిన తీరు బాగుంది.

టెక్నికల్‌ విభాగం :

సత్య చిత్ర కథకుడు దర్శకుడు వాలీ మోహన్‌దాస్‌ దర్శకునిగా తన టేస్ట్‌ ఎలా ఉంటుందో మొదటి సినిమాలోనే చూపించారు.

కొన్ని సీన్స్‌లో మధ్యతరగతి వాడు ఎలా ఉండాలో, ఎంతలో ఉండాలో చెప్పినతీరు ఎంతో బావుంది. కెమెరా వర్క్‌ చేసిన మరుదనాయగం ఎడిటర్‌ సత్యనారాయణ తమ పనిని తాము చక్కగా చేశారు.

సత్య సినిమా సంగీత దర్శకుడు సుందరమూర్తి ఈ సినిమా బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌తో సినిమాని మరో స్థాయికి తీసుకువెళ్లాడు.

ప్లస్‌ పాయింట్స్‌ :

హమరేశ్, ప్రార్ధన, ఆడుగాలం మురుగదాస్‌ల నటన
ఇంటర్వెల్‌ సీన్, ప్రీ–క్లైమాక్స్‌
సంగీతం, పాటలు
కెమెరా వర్క్

మైనస్‌ పాయింట్స్‌  :
ఒకే సీన్‌ని చాలా సార్లు చూసిన ఫీలింగ్‌
ఫస్ట్‌ హాఫ్‌లో కొన్నిచోట్ల సాగతీతలా ఉండటం
డబ్బింగ్‌లో చిన్న చిన్న లోపాలు

ఫైనల్‌ వర్డిక్ట్‌ : సమ్మర్‌కి కరెక్ట్‌ సినిమా

రేటింగ్‌ : 3/5
                          శివమల్లాల

Also Read This Article : అమిత్ షాపై ప్రతీకార కేసు?

Satya Telugu Trailer
Satya Telugu Trailer

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.