Sarangapani Jathakam
‘కోర్ట్’ చిత్రంతో కెరీర్ బెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్న ప్రియదర్శి ప్రస్తుతం ‘సారంగపాణి జాతకం’తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు.
ఇంద్రగంటి మోహనకృష్ణ : శివలెంక కృష్ణప్రసాద్ సంయుక్తంగా రూపొందించిన ఈ చిత్రం ఏప్రిల్ 18న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హీరో ప్రియదర్శి, హీరోయిన్ రూపా కొడవాయూర్,
దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ, నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్, ఛాయాగ్రాహకుడు పి.జి.విందా,
ఈ చిత్రంలో ముఖ్యపాత్రలు పోషించిన అవసరాల శ్రీనివాస్, సాయి శ్రీనివాస్ వడ్లమాని, అశోక్ కుమార్, ప్రదీప్ రుద్ర, నివితా మనోజ్, సమీర భరద్వాజ్ పాల్గొన్నారు.
చిత్ర కథానాయకుడు ప్రియదర్శి మాట్లాడుతూ : ‘‘ఈ చిత్రాన్ని మా నిర్మాత ఎంత నమ్ముతున్నారో.. అంతకు మించి నేను నమ్ముతున్నా.
ఇంద్రగంటి గారి సినిమాలో నటించాలన్న నా పదేళ్ల కల ఈ సినిమాతో నెరవేరింది” అన్నారు.
హీరోయిన్ రూపా కొడవాయూర్ మాట్లాడుతూ : ‘‘ఈ సినిమాతో నా తెలుగు మరింత మెరుగుపడింది. ఈ చిత్రంలో నా కొత్త రూపాన్ని చూస్తారు.
పరీక్షలతో ప్రెజర్ ఫీలయి ఉన్న ఫ్యామిలీస్ అంతా హ్యాపీగా చూడాల్సిన సినిమా” అన్నారు.
చిత్ర దర్శకుడు మోహన్ కృష్ణ ఇంద్రగంటి మాట్లాడుతూ : ‘‘ఈ సినిమాలో అంతా తెలుగువారే నటించారు. ఎవరి డబ్బింగ్ వాళ్ళు చెప్పుకున్నారు.
ఈ చిత్రాన్ని వాయిదా వేయడం శివలెంక గారు తీసుకున్న సరైన నిర్ణయం. ఇందులో కామెడీ మాత్రమే కాదు, కథ కూడా ఉంది’’ అన్నారు.
అవసరాల శ్రీనివాస్ ఈ ప్రెస్మీట్లో ఓ ప్రశ్నకు బదులిస్తూ.. ‘‘నా పాత్రకు వేణు స్వామి ప్రేరణ కాదు. ఇప్పటివరకు నేను చేయని ఒక డిఫరెంట్ పాత్ర.
ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తారు’’ అని వెల్లడించారు.
ప్రజావాణి చీదిరాల
Also Read This : డిఫరెంట్ జానర్స్‌లో ‘28°C’..