కొత్త కారుని కొనుగోలు చేసిన సందీప్ రెడ్డి వంగా.. ధరెంతో తెలిస్తే..

‘అర్జున్‌రెడ్డి’ చిత్రంతో ఇద్దరి పేర్లు ఒక్కసారిగా మారుమోగిపోయాయి. ఒకటి విజయ్ దేవరకొండ అయితే మరొకటి సందీప్‌రెడ్డి వంగా. ఆ తరువాత సందీప్ తన హవాను కొనసాగిస్తూనే ఉన్నారు. ‘యానిమల్’ చిత్రంతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించారు. తాజాగా సందీప్ ఒక కొత్త కారుని కొనుగోలు చేశారు. తన సినిమా మాదిరిగానే కారు కూడా ఇతరుల కార్లతో పోలిస్తే డిఫరెంట్‌గా ఉండేలా ప్లాన్ చేసి మరీ కొనుక్కున్నారు. దాని రేటెంతో తెలిస్తే షాక్ అవుతారు.

మినీ కూపర్ అనే కారుని సందీప్‌రెడ్డి వంగా కొనుగోలు చేశారు. ఈ కారు రిజిస్ట్రేషన్ ఇప్పటికే అయిపోయింది. గురువారం నాడు పూజ చేయించి దానికి సంబంధించిన ఫోటోలను నెట్టింట పోస్ట్ చేశారు. ప్రస్తుత సందీప్ రెడ్డి కారుకి సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇక కారు ధర ఎంతో తెలుసా? రూ.60-70 లక్షల మధ్య ఉంటుంది. చూడటానికి సింపుల్‌గా ఉన్న ఆ కారు ధర అంత అని తెలుసుకున్న నెటిజన్లు షాక్ అవుతున్నారు. మొత్తానికి సందీప్ రెడ్డి వంగా ఆన్‌స్క్రీన్ పైనే కాకుండా ఆఫ్‌స్క్రీన్‌లోనూ సంచలనం క్రియేట్ చేస్తున్నారు.

ప్రజావాణి చీదిరాల

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *