ఏప్రిల్ 11 న సంపూర్ణేష్ బాబు, సంజోష్ మూవీ ‘సోదరా’

ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేసే సినిమాల్లో నటిస్తూ హీరోగా తనకంటూ ప్రేక్షకుల్లో ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాందించుకున్న నటుడు సంపూర్ణేష్‌ బాబు..

అన్నదమ్ముల అనుబంధం నేపథ్యంలో, అన్నదమ్ముల అనుబంధాన్ని ఆవిష్కరిస్తున్న ‘సోదరా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

ఈ చిత్రంలో సంపూర్ణేష్ బాబుతో పాటు సంజోష్‌ కూడా ముఖ్యపాత్రలో నటిస్తున్నాడు.

సంపూర్ణేష్ బాబు, సంజోష్, ప్రాచీబంసాల్, ఆరతి గుప్తా ముఖ్యపాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘సోదరా’.

చిత్రీకరణ పూర్తిచేసుకుని, నిర్మాణానంతర పనులను శరవేగంగా జరుపుకుంటోన్న ఈ చిత్రం ఏప్రిల్‌ 11న ఈ వేసవిలో విడుదల కాబోతుంది.

మన్‌ మోహన్‌ మేనం పల్లి దర్శకత్వంలో క్యాన్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై చంద్ర చగంలా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ అన్నదమ్ముల బంధం ఎంత గొప్పదో మనందరికీ తెలుసు అలాంటి అన్నదమ్ముల బంధాన్ని వెండితెరపై మనకు ఆవిష్కరించబోతున్న చిత్రమే సోదరా.

ఇంతకు ముందు ఈ చిత్రం నుండి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ అలాగే నాలుగు పాటలకు మంచి స్పందన లభించాయి.

తెలుగు చిత్రసీమలో ఎందరో సోదరులు ఉన్నారు అలాంటి సోదరులందరినీ బంధాన్ని అద్దం పట్టేలా చూపించడానికి ఈ సోదరా వస్తోంది.

తప్పకుండా మా సోదరా చిత్రం ఈ వేసవికి ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేస్తుందనే నమ్మకం ఉంది’ అన్నారు.

నిర్మాత మాట్లాడుతూ ” సంపూర్ణేష్‌ బాబు నుంచి ప్రేక్షకులు ఆశిస్తున్న ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు ఆయనలోని మరో కోణాన్ని ఈ చిత్రంలో చూడబోతున్నారు.

తప్పకుండా ఈ చిత్రం విజయం సాధిస్తుందనే నమ్మకం వుంది’ అన్నారు.

Also Read This : నాన్నా నేను ఛీర్స్‌ కొట్టుకుని చిల్డ్‌ బీర్‌ తాగేవాళ్లం– యస్‌.పి చరణ్‌..

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *