వైవిధ్యమైన సినిమాలను ఎంచుకుంటూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న కథానాయకుడు సంపూర్ణేష్ బాబు. ‘సోదరా’ చిత్రంలో నటిస్తున్నాడు. అన్నదమ్ముల అనుబంధంతో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసే సినిమాల్లో నటిస్తూ హీరోగా తనకంటూ ప్రత్యేకతను చాటుకున్నాడు. ఈ చిత్రంలో సంపూతో పాటు మరో హీరో సంజోష్ కూడా నటిస్తున్నాడు. మన్ మోహన్ మేనంపల్లి దర్శకత్వంలో క్యాన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై చంద్ర చగంలా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్బంగా చిత్ర కథానాయకులు సంపూర్ణేష్ బాబు, సంజోష్‌లు మీడియాతో ముచ్చటించారు.
సంపూర్ణేష్ బాబు మీడియాతో మాట్లాడుతూ.. ‘‘అన్నదమ్ముల బంధం ఎంత గొప్పదో అందరికీ తెలిసిందే. ఆ బంధాన్ని వెండితెరపై ‘సోదరా’గా ఆవిష్కృతం కానుంది. ఆవిష్కరించబోతున్న చిత్రమే సోదరా. ఇది నా గత చిత్రాల తరహాలో ఉండదు. ఇది కుటుంబ కథ ఇద్దరూ అన్నదమ్ముల కథ. అన్నగా బరువు బాధ్యతలు ఉన్న పాత్రను ఈ చిత్రంలో పోషించాను. ఈ సినిమా చూస్తున్నంత సేపు ప్రతి ఒక్కరూ తమ జీవితంలో జరిగిన ఏదో ఒక ఘటన గుర్తుకు వస్తుంది. నా రియల్ లైఫ్ నరసింహాచారి పాత్రకూ.. ఈ సినిమాలోని పాత్రకూ దగ్గర పోలిక ఉంటుంది. అందరికి తమ రియల్‌లైఫ్ సంఘటనలు గుర్తుకు వస్తాయి. సినిమా చూశాక ప్రతి ఒక్కరూ తమ అన్నదమ్ములకు ఫోన్ చేస్తారు. నా రియల్‌లైఫ్‌లో ఉండే నరసింహా చారికి ఈ చిత్రంలో చేసిన పాత్రకు దగ్గరి పోలికలు ఉంటాయి. ప్రస్తుతం నాకు వేరే చిత్రాల షూటింగ్ కూడా ఉంది. కానీ మూడ్ పోకూడదని ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్నాకే వేరే సినిమాల షూటింగ్‌లో పాల్గొన్నా. అందరూ ‘హృదయ కాలేయం’ లాంటి సినిమాలు మళ్లీ మీ నుంచి ఎందుకు రావడం లేదు? అంటున్నారు. ఆ స్థాయికు తగ్గ కథలు దొరక్కే చేయడం లేదు. ఈ మధ్య కథలు విన్నా కానీ పెద్దగా నాకు ఎక్కలేదు. ‘హృదయ కాలేయం’ మించిన కామెడీ కథ దొరికితే చేస్తాను’’ అని తెలిపాడు.
మరో కథానాయకుడు సంజోష్ మాట్లాడుతూ.. ‘‘నేను ఇంతకు ముందు ‘బేవరస్’ అనే సినిమాలో హీరోగా నటించాను. సంపూకి సోదరుడిగా నటించడం ఎంతో ఆనందంగా ఉంది. అన్నదమ్ముల అనుబంధాన్ని తెలిపే కథ ఇది. అన్నదమ్ముల మధ్య ఉన్న ప్రేమను వ్యక్తపరిచేందుకే దర్శకుడు ఈ సినిమాకు బ్రోమాంటిక్ అని ట్యాగ్ ఇచ్చాడు. ఇదొక అమాయకుడైన అన్న, అప్‌డేట్ అయిన తమ్ముడి కథ. ఇలాంటి కథతో ఇప్పటి వరకూ ఏ సినిమా వచ్చింది లేదు. ప్రతి ఒక్కరి హృదయాన్ని ఈ సినిమా టచ్ చేస్తుంది. ఈ చిత్రంలో బాబుమోహన్ పాత్ర చాలా బాధ్యతతో కూడిన తండ్రి పాత్ర. నాకు ఇంతకు ముందే సంపూతో పరిచయం ఉన్నది. అందుకే సంపూ ఈ పాత్ర చేస్తే సర్‌ప్రైజ్‌గా ఉంటుందని అనుకున్నాం. సంపూ కూడా కథ వినగానే ఓకే అన్నాడు. స్వచ్చతకు మారుపేరుగా అన్నదమ్ముల అనుబంధం ఈ రోజుల్లో కరువై పోయింది. ఎక్కడో కానీ అలాంటి అనుబంధాలు చూడటం లేదు. ఈ సినిమా చూశాక ఒకరిద్దరూ మారిన మాకు సంతోషమే. ఈ సినిమాలో అన్నదమ్ముల అనుబంధం అందరిని నవ్విస్తుంది.. ఏడిపిస్తుంది. ఇక త్వరలోనే నేను సోలో హీరోగా రియల్ ఇన్‌సిడెంట్ కథతో సినిమా చేస్తాను. ఒక ఇగోయిస్ట్ పోలీస్ ఆఫీసర్‌కు కామన్ మ్యాన్‌కు జరిగే కథతో సినిమా ఉంటుంది’’ అన్నారు.
ప్రజావాణి చీదిరాల