Samantha: సమంత ఇండస్ట్రీలో పెద్దగా టైం తీసుకోకుండానే స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. అయితే మధ్యలో ఎందుకోగానీ ట్విటర్‌కు మాత్రం సామ్ దూరంగా ఉండిపోయింది. ఒకరకంగా చెప్పాలంటే డీయాక్టివేట్ చేసింది. 2012లో ట్విటర్ అకౌంట్ ఓపెన్ చేసిన సామ్.. ఆ తరువాత దానిలో పోస్టులన్నీ డిలీట్ చేసింది. ఆ తరువాత ఆమె ట్విటర్ జోలికి వెళ్లలేదు. కేవలం ఇన్‌స్టా, ఫేస్‌బుక్‌లలో మాత్రమే యాక్టివ్‌గా ఉంటూ వస్తోంది. సోమవారం సామ్ ఎక్స్‌లోనూ రీఎంట్రీ ఇచ్చింది. ఆమె తొలి పోస్టుతో ఫ్యాన్స్ కూడా అలర్ట్ అయిపోయారు. అసలు తొలి పోస్ట్ ఏం పెట్టిందో తెలుసా? ప్రస్తుతం సమంత నిర్మాతగా మారిపోయిన విషయం తెలిసిందే.
‘ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్’ అనే ప్రొడక్షన్ హౌస్‌ను ప్రారంభించి ‘శుభం’ అనే సినిమాను తొలిసారిగా నిర్మించింది. ప్రస్తుతం ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ విషయాన్ని తెలుపుతూ ఎక్స్‌లో సమంత ఆసక్తికర పోస్టు పెట్టింది. ‘పెద్ద కలలతో.. మా చిన్న ప్రేమను మీకు అందిస్తున్నాం. ఈ సినిమాని అందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నా. ఇది నిజంగా నాకెంతో ప్రత్యేకం. గొప్ప ప్రారంభం’ అని పేర్కొంది. ఇదంతా ఒక ఎత్తైతే సమంత ట్విటర్‌లో రీఎంట్రీ ఇవ్వడం ఫ్యాన్స్‌కు బిగ్ సర్‌ప్రైజ్ అనే చెప్పాలి. ఒక్కసారిగా ట్విటర్‌లో సమంత పోస్ట్ కనిపించడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. రీఎంట్రీని స్వాగతిస్తూ పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు. ఇక ఒక్కొక్కటిగా సమంత అన్ని పనులూ చక్కబెడుతూ వస్తోంది. మరి ఈ ముద్దుగుమ్మ సిల్వర్ స్క్రీన్‌పై తిరిగి ఎప్పుడు కనిపిస్తుందో చూడాలి.
ప్రజావాణి చీదిరాల
Also Read This : అయోధ్యలో తెలుగు దర్శకులకు అవార్డులు
