Sai Kumar :
83 సంవత్సరాలుగా మహారాష్ట్ర లోని పూణె నగరం లో తెలుగు భాష,
సంసృతికై విశిష్ట సేవలందిస్తున్న ఆంధ్ర సంఘం పూణె మార్చి 30 వ తేదిన తెలుగు సంవత్సరాది వేడుకను ఘనంగా నిర్వహించింది.
నటప్రస్ధానం లో 50 వసంతాలు పూర్తి చేసుకున్న విలక్షణ నటుడు శ్రీ సాయికుమార్ గారు ముఖ్య అతిధిగా విచ్చేసి,
అశేషంగా తరలి వచ్చిన తెలుగు వారందరిని ఆనంద డోలికల్లో విహరింప చేసారు.
తెలుగు సాంసృతిక సేవలో ఎనిమిది దశాబ్దాలుగా భాసిల్లుతున్న ఆంధ్రసంఘం పూణె శ్రీ సాయికుమార్ గారిని ఘనంగా సత్కరించి అభినయ వాచస్పతి అన్న బిరుదును,
వైభవంగా జరిగిన వేడుకలో ప్రధానం చేయడం ప్రత్యేక ఆకర్షణ గా నిలిచింది.
ఆంధ్రసంఘం కార్యవర్గ సభ్యులు, శ్రీ టి వి. శ్రీనివాస్ గారు వాఖ్యాత గా సభ నిర్వహించగా,ఆంధ్ర సంఘం పూణె కార్యవర్గ ప్రతినిధులు
శ్రీ వంశీకృష్ణ, శ్రీమోహన్ నాయుడు, శ్రీ వెంకటరెడ్డి, శ్రీ పి.వి.గుప్తా, శ్రీ రాఘవేంద్ర, శ్రీ ప్రద్యుమ్న, శ్రీ రాజశేఖర శర్మ మరియు శ్రీకాళిప్రసాద్ హజరైన తెలుగువారందరిని
చక్కటి ఆతిధ్యం అందించి ఉత్సాహంగా నిర్వహించారు. సలహాదారు శ్రీ శేషగిరి రావు సహకారమందించారు.
పూణెనగరం లో నివసిస్తున్న స్ధానిక కళాకారులు వివిధ సాంసృతిక, వినోద కార్యక్రమాలలో పాల్గొన్నారు.
Also Read This : 13 ఏళ్ల తర్వాత మెగాఫోన్ పడుతున్న తనికెళ్ల భరణి
