RP.Patnaik
ఎక్కడన్నా చెవికి భగవద్గీత వినిపిస్తుంటే అక్కడ ఎవరన్నా చనిపోయారేమో అనుకుంటాం.
ఇదిలా ఉంటే భగవద్గీత మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను అంటూ జడ్జిగారి ముందు కోర్టులో సాక్షులతో ప్రమాణం చేపిస్తారు సదరు లాయర్లు.
భగవద్గీత అంటే ఈ రెండు విషయాల కోసమే అనుకునే ప్రమాదంలో ప్రస్తుతం మనందరం ఉన్నాం.
అలాంటి ప్రమాదం నుండి విముక్తి చేయటానికి భగవద్గీత 18 అధ్యాయాలను గీతలోని తాత్పర్యాన్ని యువతను టార్గెట్ చేస్తూ కేవలం తాత్పర్యాన్ని
మీ అందరికి సరళంగా అర్థమయ్యే భాషలో నేను వినిపిస్తాను అంటూ ముందుకొచ్చారు ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్.పి పట్నాయక్ గారు.
ఆయన సారధ్యంలో విడుదలైన గీతా తాత్పర్యాలను ప్రేక్షకులు మిలియన్ల కొద్ది వ్యూస్‌తో ఆశీర్వదించటంతో పట్నాయక్‌గారిని ఇంటర్వూ చేయటం జరిగింది ట్యాగ్‌తెలుగు యూట్యూబ్ చానల్.
భగవద్గీత గురించి చెప్పిన తాత్పర్యాలతో వచ్చిన తృప్తితో ఆగకుండా త్వరలోనే వాల్మీకి రామాయణాన్ని అందరికి అర్థమయ్యే విధంగా చెప్తాను అన్నారు.
రామాయణం గురించి మాట్లాడుతూ సీతకు రామునితో స్వయంవరమే జరగలేదని బాంబ్ పేల్చారు.
ప్రముఖ సంగీత దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, సునీల్ తన రూమ్‌మేట్స్ అని మేమంతా ‘ఆ నలుగురు’ చిత్ర దర్శకుడు చంద్రసిద్ధార్ధ్‌తో మంచిగా టైమ్ స్పెండ్ చేసేవారిమని బోలెడు విషయాలు చెప్పారు.
సోమాజిగూడలో ఉన్న ట్రైలక్ కేఫ్ మా అందరి అడ్డా అంటూ ఇలాంటి మరెన్నో విషయాలను ఈ ఇంటర్వూలో పంచుకున్నారాయన. ఇంటర్వూ బై శివమల్లాల
Also Read This : ఆ లెటర్‌వల్ల వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆత్మ క్షోభించదా?