ఆఫ్‌లైన్‌లోకి వచ్చిన రౌడీ హీరో

ప్రస్తుత తరుణంలో ఆన్‌లైన్ వ్యాపారం కంటే ఆఫ్‌లైన్ వ్యాపారం నిర్విఘ్నంగా కొనసాగుతోంది. షాపింగ్‌కు వెళ్లే తీరిక లేని జనం ఆఫ్‌లైన్ షాపింగ్ ద్వారానే ప్రతిదీ కొనుగోలు చేస్తున్నారు. ఈ తరుణంలో బడా వ్యాపారస్తుల నుంచి చిన్న చిన్న షాపుల వారి వరకూ ఆఫ్‌లైన్ వ్యాపారానికి తెరదీస్తున్నారు. రౌడీ హీరో విజయ్ దేవరకొండ కూడా రౌడీ వేర్ పేరిట ఫ్యాషన్ బ్రాండ్‌ను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకూ ఆన్‌లైన్‌కే పరిమితమైన బ్రాండ్‌ను ఇప్పుడు ఆఫ్‌లైన్‌లోకి తీసుకొచ్చారు.

ఈ క్రమంలోనే రౌడీ వేర్ ఫస్ట్ ఆఫ్‌ లైన్ స్టోర్‌ను హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ బ్రాడ్ వేలో ప్రారంభించారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. రౌడీ వేర్ ఆఫ్ లైన్ స్టోర్స్‌కు చాలా డిమాండ్ ఉందన్నారు. తనను ఫ్యాషన్ లవర్స్ ఎప్పటి నుంచో ఆఫ్‌లైన్ స్టోర్ ప్రారంభించాలని కోరుతున్నారన్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లో తమ ఫస్ట్ ఆఫ్ లైన్ స్టోర్‌ను ప్రారంభించడం సంతోషంగా ఉందని విజయ్ తెలిపారు. ఏ గుర్తింపు లేని స్థాయి నుంచి తనను స్టార్ హీరోగా గుర్తింపు సంపాదించుకోవడం వరకూ తన జర్నీ తనను ఎంతగానో ఎగ్జైట్ చేస్తుందని తెలిపారు.

ప్రజావాణి చీదిరాల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *