Rakesh KCR :
కెసిఆర్ బ్యాక్‌స్టోరి ఎంటో చెప్పిన రాకింగ్ రాకేష్…..
జబర్దస్త్ అనగానే గుర్తుకు వచ్చేది ఎడల్ట్ కంటెంట్ అనుకునే రోజుల్లో ఏ అడల్ట్ కంటెంట్ లేకుండా కూడా ప్రేక్షకులను నవ్వించొచ్చు అని ఒక కుర్రాడు ఎంట్రీ ఇచ్చాడు.
ఆ వరంగల్ మిమిక్రి కుర్రాడి పేరు రాకేష్. జబర్దస్త్ వల్ల రాకింగ్ రాకేష్ అయ్యాడు.
ఆ స్టేజ్‌మీద ఎందరో కొత్త నటీనటులకు ఎంట్రీ, ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు దాదాపు ఒక 60మంది నటీనటులకు ఇళ్లు ,వాకిలి సమకూరింది.
మార్కెట్‌లో పేరు ప్రఖ్యాతులు అధనం. ఇటువంటి సమయంలో ఎవరైనా హాయిగా కాలం వెళ్లదీయాలి అనుకుంటారు.
అటువంటిది రాకేష్ మాత్రం సినిమా తీయాలి సినిమాలో నిలబడాలి అనే పెద్ద కలను కన్నాడు. కలను ఎవరైనా కంటారు.
ఆ కల నెరవేర్చుకోవాలంటే ఎంత కష్టమైనా సరే ఆ కష్టాన్ని పడాలి అనుకున్నాడు. అంతే ఇంకేం ఆలోచించకుండా కథను సిద్ధం చేసుకున్నాడు.
తనే హీరోగా, నిర్మాతగా మారి పోరాటం చేయటానికి రెడీ అయ్యాడు.
ఈ సమయంలో అతనికి ఎంతో ఇష్టమైన నటుడు ధన్‌రాజు ధైర్యం చెప్పి నీకు తోడుగా ‘గరుడవేగ’ అంజి దర్శకునిగా అయితే కరెక్ట్‌గా ఉంటుంది అని అతన్ని రాకేష్‌కి జతచేశాడు.
వాళ్ల ప్రాజెక్ట్‌కు కథ–నిర్మాత–హీరో–దర్శకుడు– కెమెరామెన్ ఓకే అవ్వటంతో ప్రాజెక్ట్‌కి అందం వచ్చింది.
ఇద్దరు ఒకమాట మీద ఉండి చిన్న బడ్జెట్‌లో వాళ్లు అనుకున్న కథను ఎలా చెప్పాలి? ఎక్కడ చెప్పాలి? అని ఫుల్‌ప్లాన్‌తో ప్రీప్రొడక్షన్ నిర్వహించారు. అక్కడ వాళ్ల తొలివిజయం.
ఆ తర్వాత అనుకున్న ప్రకారం షూటింగ్ జరిపి సినిమాని పూర్తిచేశారు. సినిమా వాళ్లు అనుకున్న విధంగా వచ్చింది. ఇంతకి సినిమా టైటిల్ చెప్పలేదు కదూ.
సినిమా పేరు కెసిఆర్….తెలంగాణా పోరాటయోధుడు రాష్ట్ర స్థితి, గతిని మార్చిన కె.సి.ఆర్ పేరు ఒక చిన్న సినిమాకి పెట్టారు.
కానీ ఈ సినిమాలో ఆయన ప్రస్థావన ఉంటుంది కానీ సినిమా టైటిల్‌కి ఆయనకు ఎటువంటి సంబంధం లేదు.
‘కేశవ చంద్ర రమావత్’ అనే ఒక లంబాడి తండాకు చెందిన కుర్రాడి పేరు మీద రానున్న కథ అది.
కెసిఆర్ పాత్రలో రాకింగ్ రాకేష్, అతనికి జంటగా అనన్య (నటి సత్యకృష్ణ కూతురు) నటించారు.
నవంబర్ 22న సినిమా విడుదల అవ్వనుంది. ఈ సమయంలో ఎంతో కాన్ఫిడెంట్‌గా మాట్లాడిన రాకేశ్ తన సినిమా ఎంతో పెద్ద విజయం సాధిస్తుందని తెలియచేశారు.
శివమల్లాల
Also Read This : అల్లు అర్జున్ మాస్టర్‌స్ట్రోక్….
