Revanths cabinet: ఇది ప్రతిపక్ష బీఆర్ఎస్ తోపాటు తెలంగాణలోని మైనారిటీలందరి మదినీ తొలుస్తున్న సందేహం.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక పదేళ్ల తరువాత కాంగ్రెస్ అధికారంలోకి రాగా, ఆ పార్టీ నుంచి ముస్లిం మైనారిటీలు ఒక్కరు కూడా ఎమ్మెల్యేగా గెలవని విషయం తెలిసిందే.
దీంతో సీఎం రేవంత్ రెడ్డి సర్కారు కొలువు దీరిన సమయంలో తొలి విడతగా ఏర్పాటైన మంత్రివర్గంలో మైనారిటీలకు చోటు దక్కలేదు.
అయితే తొలి విడతలో సీఎంతో కలిపి 12 మందితోనే మంత్రివర్గం ఏర్పడటంతో మరో ఆరు బెర్తులు ఖాళీగా ఉన్నాయి.
మంత్రిపదవి ఇస్తారన్న ప్రచారం జరిగింది
దీంతో మైనారిటీ నేతల్లో ఒకరిని ఎమ్మెల్సీని చేసి.. మంత్రిపదవి ఇస్తారన్న ప్రచారం జరిగింది. ఇందుకోసం మాజీ మంత్రి,
సీనియర్ నేత షబ్బీర్ అలీతోపాటు అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన మాజీ క్రికెటర్ అజరుద్దీన్ పేరు,
నాంపల్లి లో ఓడిపోయిన ఫిరోజ్ ఖాన్ పేరు కూడా ప్రచారం లోకి వచ్చాయి.
అయితే ఎమ్మెల్యేల కోటాలో కాంగ్రెస్ కు దక్కిన రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో మైనారిటీలెవరికీ అవకాశం ఇవ్వలేదు.
పైగా షబ్బీర్ అలీని ప్రభుత్వ సలహాదారుగా క్యాబినెట్ ర్యాంకులో నియమించారు.
ఇక గవర్నర్ కోటాలోనూ ఇద్దరిని ఎమ్మెల్సీలుగా నామినేట్ చేసే అవకాశం ఉండడంతో ఒకటి ప్రొఫెసర్ కోదండరాం కు,
మరొకటి సియాసత్ ఉర్దూ పత్రిక న్యూస్ ఎడిటర్ ఆమిర్ ఖాన్ కు ఇచ్చారు.
దీంతో మున్ముందు కూడా క్యాబినెట్లో ముస్లింలకు చోటు దక్కడం
దీంతో మైనారిటీ కోటాలో తాను మంత్రినవుతానని ఆమిర్ ఖాన్ భావిస్తున్నారు.
కానీ, ఆయనకు ఎటువంటి రాజకీయ అనుభవం లేదని,
ఆయనకు ఇస్తే సుదీర్ఘ అనుభవొం కలిగిన నేతలు అసంతృప్తికి లోనయ్య ప్రమాదం ఉందని కాంగ్రెస్ నాయకత్వం భావిస్తోంది.
దీంతో మున్ముందు కూడా క్యాబినెట్లో ముస్లింలకు చోటు దక్కడం అనుమానంగానే కనిపస్తోంది.
ఇప్పట్లొ మరోసారి ఎమ్మెల్సీ ఎన్నికలు లేకపోవడంతో ప్రస్తుతానికి ఈ అంశాన్ని పక్కడ పెట్టినట్టేనని తెలుస్తోంది.
ఇదే అదనుగా ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ.. మైనారిటీలకు కాంరెస్ అన్యాయం చేస్తోందని, వారిపట్ల విక్ష చూపుతోందని ఆరోపిస్తోంది.
సీఎం రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్ మూలాలున్న వ్యక్తి కావడం వల్ల.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ముస్లింల విషయంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరించినట్లే తెలంగాణలోనూ రేవంత్ వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ ఆరోపణలు గుప్పిస్తోంది.
మరి దీనికి కాంగ్రెస్ సర్కరు ఎటువంటి సమాధానం చెప్పుకొంటుందో చూడాలి.
Also Read: Famous Telugu Producers : చాపకిందనీరులా తమిళంలోకి తెలుగు నిర్మాతలు…