“సుదర్శన చక్రాన్ని కలిగి భూమిపై ఉన్న ఏకైక వాసుదేవ విగ్రహం గురించి వివరిస్తూ ” దేవకీ నందన వాసుదేవ చిత్రం విడుదల కానుంది .
‘గుణ 369’ ఫేమ్ అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహించగా, ‘హనుమాన్’ దర్శకుడు ప్రశాంత్ వర్మ కథ అందించారు. మిస్ ఇండియా మానస వారణాసి ఈ మూవీలో హీరోయిన్ గా నటిస్తుంది.
అశోక్ గళ్ళ తన తొలి చిత్రం ‘హీరో’ తర్వాత రెండవ చిత్రంగా అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో “దేవకీ నందన వాసుదేవ”తో వస్తున్నాడు.
సుదర్శన చక్రాన్ని కలిగి ఉన్న భూమిపై ఉన్న ఏకైక వాసుదేవ విగ్రహం గురించి వివరిస్తూ శక్తివంతమైన పాత్రలో అశోక్ గల్లా తన యాక్షన్-ప్యాక్డ్ పాత్రను ప్రదర్శించే ఫైట్ సీక్వెన్స్ ద్వారా పరిచయం అయ్యాడు. ఈ సినిమా కోసం అశోక్ గళ్ళ హెయిర్ అండ్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కోసం నాలుగు నెలలు కష్టపడ్డాడు .
ప్రశాంత్ వర్మ గారికి నేను చేసిన గుణ 369 లో ఎమోషన్స్ , లవ్ అండ్ సాంగ్స్ అంటే చాల ఇష్టం అందుకే నన్ను ఈ సినిమా చేయమన్నారు…అయన కథ ఇచ్చారు నేను ఓన్ చేసుకున్నను… ఈ సినిమా అశోక్ గల్లా ముందు చాలా మందిని అనుకున్నాం. కానీ ఈ కథ ఆయన్ని వరించింది ….
మొత్తానికి దేవకి నందన వాసుదేవ చిత్రం నవంబర్ 22న సినిమా థియేటర్లలోకి రానుంది అన్నారు అర్జున్ జంధ్యాల.
సంజు పిల్లలమర్రి
Also Read This : ఈ సంక్రాంతంతా తమనే మోగిస్తాడు…