దేశవాళీ క్రికెట్‌లో బంతి తగిలి మరణించిన క్రికెటర్ ఫిలిప్ హ్యూస్‌కు ఆస్ట్రేలియా క్రికెట్ నివాళి అర్పించింది.
పదోవ వర్ధంతి సందర్భంగా అతడి సేవలను ఈ సందర్భంగా గుర్తు చేసుకుంది.
షెఫీల్డ్ షీల్డ్ టోర్నమెంట్‌లో భాగంగా 2014, నవంబర్ 25న సిడ్నీ క్రికెట్ మైదానంలో సౌత్ ఆస్ట్రేలియా, న్యూసౌత్ వేల్స్ మధ్య జరిగిన మ్యాచ్ ఎప్పటికి మర్చిపోలేని చేదు జ్ఞాపకం.
ఈ మ్యాచ్‌లో భాగంగా ప్రత్యర్థి జట్టు బౌలర్ విసిరిన బౌన్సర్ ఫిలిప్ హ్యూస్ తలకు బలంగా తాకడంతో అక్కడిక్కడే మైదానంలో కుప్పకులాడు.
హెల్మెట్ ధరించినప్పటికీ బంతి ఎడమచెవి కింది భాగంలో బలంగా తాకడంతో అపస్మారక స్థితిలోకి వెళ్ళాడు.
వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్సనందించారు.అందరు అతడు బ్రతకాలి అని ప్రార్థనలు చేసారు కానీ రెండు రోజుల తర్వాత కన్నుమూశాడు.
మరణించే నాటికి ఫిలిఫ్ హ్యూస్ వయసు 25 ఏళ్లు. అతడు చనిపోయి పదేళ్లు పూర్తైన సందర్భంగా అతడి సేవలను క్రికెట్ ఆస్ట్రేలియా స్మరించుకుంది. .
ఆస్ట్రేలియా జట్టు తరుపున 25 టెస్టులు, 24 వన్డేలకు ఫిలిప్ హ్యూస్ ప్రాతినిధ్యం వహించాడు.
ఫిలిప్ హ్యూస్‌కు జరిగిన దానిని దృష్టిలో పెట్టుకుని ఆటగాళ్లు నెక్ గార్డులు ధరించాలని ఆస్ట్రేలియా క్రికెట్ చెప్పుకొచ్చింది .
అయితే, క్రికెటర్లకు ఇబ్బందిగా ఉంటుందని చాలామంది వాటిని ధరించడం లేదు.
దాని వల్లా ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుండడంతో కాస్త జాగ్రత్తగా ఉండాలి అని సూచించారు.
సంజు పిల్లలమర్రి
Also read this : అందుకే రష్మిక ప్లేస్ లో శ్రీలీలను తీసుకున్నాం…