2024 Incidents
ఈ ఆరు సంఘటనలని ప్రతి ఒక్కరూ గమనించారు…
ప్రతి ఏడాది ఏదో ఇబ్బందికమైన పరిస్థితులు ఎదురవుతూనే ఉంటాయి.
ముఖ్యంగా సినిమావారు, పొలిటికల్ లీడర్స్, బిజినెస్ పీపుల్ వీరి కెరియర్లలో అనుకోని సంఘటనలు వచ్చి మీద పడుతుంటాయి.
ఈ పరిస్థితులను ఎవరు ఊహించలేరు. అందుకే కొన్ని హఠాత్ పరిణామాల వల్ల ఎంతో డిస్టబెన్స్ ఎదుర్కొంటారు సంబంధిత వ్యక్తులు.
ఈ సంఘటనల గురించి వార్తలు ప్రసారం అవుతున్నప్పుడు అవే వార్తను కొన్ని రోజులపాటు టీవి ఛానల్స్,
సోషల్ మీడియా ప్రసారం చేస్తుంటే చూసేవారికి విసుగువచ్చి అలాంటి కంటెంట్‌లను చూడటానికే ఇష్టపడటంలేదు.
2024లో జరిగిన అలాంటి సంఘటనలను ఒకసారి గుర్తు చేసుకుందాం.
1. హీరో రాజ్‌తరుణ్ – లావణ్య
హీరో రాజ్‌తరుణ్ 2011 నుండి 2017 వరకు నేను లావణ్యతో కలిసి ట్రావెల్ చేశాను.
కానీ 2017 తర్వాత నాకు ఆమెతో ఎటువంటి సంబంధం లేదు అని రాజ్‌తరుణ్ స్టేట్‌మెంట్ ఇచ్చారు.
అంతకుముందు తన ఎక్స్ గర్ల్‌ఫ్రెండ్ లావణ్యా రాజ్‌తరుణ్ నన్ను మోసం చేశాడు అని కేసు పెట్టింది.
మొదట లావణ్య రాజ్‌తరుణ్‌పై కేసు పెట్టటంతో రాజ్‌తరుణ్ ఆ కేసును గురించి చాలారోజుల పాటు ఫైట్ చేయాల్సి వచ్చింది.
వాళ్లిద్దరి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వీడియోలు, ఆడియోలతో కొంతకాలం మీడియా టైంపాస్ చేసింది.
పెద్ద న్యూస్ ఛానల్స్‌కూడా ఇదే దేశసమస్య అన్నట్లు నెలరోజులపాటు
ఈ ఉధంతాన్ని టెలికాస్ట్ చేయటంతో చాలామంది ఆడియన్స్ టివి చూడటం మానేశారు.
2. దివ్వెల మాధురి– దువ్వాడ శ్రీనివాస్
కొంతకాలం పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగా వినిపించిన జంటపేరు
దివ్వెల మాధురి మరియు రాజకీయ నాయకుడు దువ్వాడ శ్రీనివాస్‌ల పేర్లు.
ఇద్దరికి కుటుంబాలు ఉన్నాయి. మంచి రాజకీయ పలుకుబడి కూడా ఉంది.
అందుకే వారి వ్యక్తిగత విషయాలు బయటకు వచ్చినప్పుడు మీడియా కూడా కొంచెం యాక్టివ్‌గా స్పందించింది.
కారణం ఏంటంటే మంచిని చెప్తే ఎవరు చూస్తారు?
ఇలాంటి చెత్త విషయాలపై ఆడియన్స్ కూడా ఇంట్రెస్ట్ చూపటంతో వీరి కథను చెప్పటం కోసమే
ఆ సమయంలో కొన్ని యూట్యూబ్ ఛానల్స్ పుట్టుకొచ్చాయంటే అతిశయోక్తి కాదేమో.
అందుకే వీరిగురించి కూడా 2024లో ఎక్కువ కంటెంట్ లోడ్ అయ్యింది.
3. జాని మాస్టర్‌కి నేషనల్ అవార్డు
ధనుష్, నిత్యామీనన్ జంటగా నటించిన తమిళ చిత్రానికి అత్యద్భుతమైన డాన్స్ పర్‌ఫెర్మాన్స్ చేసినందుకు
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ని జాతీయ అవార్డు వరించింది.
ఆ అవార్డు అతన్ని వరించినందుకు తెలుగు చిత్ర పరిశ్రమ భారీ ఎత్తున జానీ మాస్టర్‌కి సన్మానం చేసింది.
ఈ సన్మానం జరిగిన వారం రోజులకి అతనిపై లైంగికవేధింపుల కేసు పెట్టింది తన శిష్యురాలు స్రష్ఠ.
అప్పటికి వారిద్దరికి ఉన్న పరిచయం పదేళ్ల పైమాటే.
ఏడేళ్లపాటు తనను లైంగికంగా హింసించాడని ఆమె ఫిల్మ్‌ఛాంబర్‌కి కంప్లైంట్ ఇవ్వగా
పెద్దల సూచనల మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసింది ఆ యువతి.
అక్కడనుండి వారద్దరి కథను పుంఖానుపుంఖాలుగా ప్రచారం చేసింది మీడియా.
ఈ కేసువల్ల డాన్సర్స్ యూనియన్‌కి అధ్యక్షునిగా ఉన్న జానీ
తన పదవిని కోల్పోవటంతోపాటు నేషనల్ అవార్డును కూడా కోల్పోయారు.
ఈ కేసులో కోర్టు ఆయనకు శిక్ష విధించటంతో కోర్ట్ కి వెళ్లి బెయిల్‌పై బయటకి వచ్చారు జానీ.
ఈ కేసు గురించి జానీది తప్పని కొందరు, ఆమెదే తప్పని మరికొందరు వాదించటంతో
రెండు వర్గాల వాధనలను మీడియా విపరీతంగా కవర్ చేయటంతో అవసరం లేని చెత్తంతా చూస్తున్నామా?
అన్న ఫీలింగ్‌తో ఆ వ్యవహారం సద్దుమణిగే టీవిలు కట్టేశారు కొందరు.
2024లో జరిగిన అతి పెద్ద డిజాస్టర్ ఇన్సిడెంట్లలో ఇదొక ఇన్సిడెంట్.
4. వేణుస్వామి జాతకం తిరగబడిందా ?
ప్రపంచంలో జరిగే మంచిని మంచిగా చెప్తే ఎవరు చూస్తారు.
ఏ న్యూస్‌కైనా కొంచెం మసాలా జోడిస్తే ఎంతో మంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది అని కనిపెట్టారు వేణుస్వామి.
అడిగిన వాళ్లకు జాతకాలు చెప్తే స్వామిలాగా పూజిస్తారు ఎవరైనా.
అడగనివాళ్ల జాతకాలు కూడా చెప్తాను అందరి జాతకాలు చెప్తాను అని అవసరం లేని చెత్తంతా వాగితే ఏమవుతుందో
2024లో వేణుస్వామి జాతకం తారుమారు అవ్వటం మనందరం గమనించాం.
ముఖ్యంగా శుభమా అని పెళ్లిచేసుకునే వారిగురించి వాళ్లు అడక్కుండానే వారి కాపురం ఎలా ఉంటుంది?
వారు ఎప్పుడు విడిపోతారు అనే తప్పుడు మాటలు మాట్లాడుతూ అక్కినేని ఫ్యామిలీ వారసుడిని కించపరచటంతో
తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ పెట్టిన కేసుతో ఆయనపై కేసు నమోదైంది.
అప్పటినుండి తాను ఇకనుండి ఎవరి జాతకాలు చెప్పను కాళ్ల బేరానికి రావటం తెలిసిందే.
2024లో ఇతని జాతకం కూడా బాగాలేదనే చెప్పాలి.
5. కొండాసురేఖ– నాగార్జున– సమంత
2024లో హైడ్రా ఎంత పవర్‌ఫుల్ మాటో అందరికి తెలిసిందే.
రాష్ట్రంలోని చెరువుల కబ్జా గురించి అడ్డుకోవటానికి తెలంగాణా ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం ఇది.
ఈ సంఘటనలో మొదట వార్తల్లోకెక్కిన హైడ్రా సంఘటన ఎన్ కన్వెన్షన్ కూల్చివేత.
ఆ తర్వాత జరిగిన అనేక పరిణామాల్లో మాటకు మాట చేరటంతో గవర్నమెంట్
ఓ పక్క నాగార్జున కుటుంబం గురించి అనేక వాధనలు జరిగాయి.
ఆ సంఘటనలో కాంగ్రెస్ మంత్రి కొండా సురేఖ నాగార్జున గురించి అనకూడని, వినకూడని మాటలు మాట్లాడటంతో
ఆ సంఘటన కొన్నిరోజులపాటు తెలంగాణాలో మారుమ్రోగిపోయింది.
ఇది అస్సలు ఊహించని సంగతి కావటంతో ప్రతి ఒక్కరూ ఫీలయ్యారు. ఇదొక బ్యాడ్ ఇన్సిడెంట్.
అయితే 2024లో నాగ్ ఇంట తన పెద్దకుమారుడు నాగచైతన్య– శోభితల వివాహంతో పాటు
రెండవ కుమారుడు అఖిల్ కూడా ఎంగేజ్ అవ్వటంతో హ్యాపీగా 2024ను ముగించింది అనే చెప్పాలి.
ఈ సంఘటన ద్వారా హైడ్రా కమీషనర్ రంగనాద్ విపరీతంగా వార్తల్లో నిలిచారు.
6. పుష్పరాజుకి ఇబ్బందులు
ఈ ఏడాది డిసెంబర్ నెల మొదటివారంలో జరిగిన దురదృష్టకరమైన సంఘటన.
సంధ్య ధియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే 39 ఏళ్ల యువతి మృతి.
అల్లు అర్జున్ తన మూడేళ్ల కష్టాన్ని ప్రేక్షకులతో కలిసి థియేటర్‌లో ‘పుష్ప–2’ సినిమా చూస్తూ ఎంజాయ్ చేయాలని
కుటుంబసభ్యులతో కలిసి అక్కడకు చేరుకున్నారు. అక్కడ జరిగిన తోపులాటలో యువతి మరణించటం
ఆ యువతి కుమారుడు శ్రీతేజ్ అపస్మారక స్థితిలో ఉండంటతో ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి.
అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యి బెయిల్‌పై బయటకు వచ్చారు.
ఓ పక్క సినిమా సంచలన విజయం సాధించి దాదాపు 22 రోజుల్లో 1700కోట్ల మార్కును దాటింది.
అంత పెద్ద విజయం సాధించిన తెలుగు సినిమా ప్రపంచవ్యాప్తంగా దుమ్మురేపుతున్నప్పటికి
ఆ సినిమా టీమ్ ఎవరూ ఎంజాయ్ చేసే మూడ్‌లో లేరు.
ప్రస్తుతం ఆ సినిమా వారందరూ శ్రీతేజ్ ఆరోగ్యంగా బయటకి రావాలని అల్లు అర్జున్‌కి
ఎటువంటి శిక్ష పడకుంగా ఈ కేసునుండి బయటకు వస్తే బాగుండని అనుకుంటున్నారు.
ఇలాంటి సంఘటనలతో 2024 ముగిసింది. చూడాలి వచ్చేడాది ఎలా ఉంటుందో…
శివమల్లాల
Also Read This : జ్ఙాపిక ఎంటర్‌టైన్‌మెంట్‌కి పదేళ్లు పూర్తి…