అతిలోకసుందరి శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీకపూర్ పుట్టినరోజు నేడు. ఆమె పుట్టినరోజు సందర్భంగా ‘ఆర్.సి16’ సినిమాలోని తన స్టిల్‌ని విడుదల చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేసింది చిత్రయూనిట్. ‘ధడక్’ సినిమాతో కెరీర్‌ను ప్రారంభించిన జాన్వీ తొలిచిత్రంతోనే ప్రేక్షకులవద్ద గ్లామర్‌తోపాటు నటిగా మంచి మార్కులు వేయించుకుంది . తెలుగు హీరోలు జూనియర్ యన్టీఆర్, రామ్‌చరణ్, అల్లు అర్జున్‌లతో సినిమాలు చేసే హీరోయిన్ ఎవరైనాసరే వాళ్లు హీరోయిన్గా నెంబర్‌వన్ రేసులో ఉన్నట్లే. జాన్వీ యన్టీఆర్ హీరోగా నటించిన ‘దేవర’ చిత్రంతో తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చింది. గతేడాది ఆ సినిమా సాధించిన విజయం గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అలాగే ప్రస్తుతం రామ్‌చరణ్ హీరోగా నటిస్తోన్న ‘ఆర్.సి.16’ చిత్రంకూడా పాన్‌ఇండియా లెవెల్లో మారుమోగటానికి సిద్ధం అవుతుంది. అలాVó అల్లు అర్జున్ హీరోగా నటిస్తోన్న తర్వాత సినిమాలో జాన్వీనే హీరోయిన్‌గా నటిస్తుందని సమాచారం. హిందీలో ఫుల్ బిజీగా ఉంటూనే తెలుగులో భారీ ప్రాజెక్ట్‌లు సైన్ చేస్తుండటంతో అందరి చూపు జాన్వీపైనే పడుతుంది. ముంబైలోపుట్టి అక్కడే తన డిగ్రీ కంప్లీట్ చేసుకున్న జాన్వీ నటనలో కాలిఫోర్నియాలో శిక్షణ తీసుకుని పర్‌ఫెక్ట్ ఆర్టిస్ట్‌గా తయ్రారై ఇండియాకి వచ్చి వరుస సినిమాల్లో నటిస్తోంది. జాన్వీకపూర్‌కి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేస్తూ మరిన్ని పెద్ద ప్రాజెక్ట్‌లు చేస్తూ సక్సెస్‌ఫుల్‌గా కెరీర్ ముందుకు సాగాలని తనతో పనిచేసే నిర్మాణసంస్థలు, దర్శకులు, తోటి నటీనటులు కోరుకుంటున్నారు. ఆల్ ది బెస్ట్ టు జాన్వీ కపూర్ అంటూ బెస్ట్ విశెష్‌ను తెలియచేస్తుంది ట్యాగ్‌తెలుగు.కామ్….
శివమల్లాల
Also Read This :అపస్మారక స్థితిలో ప్రమఖ గాయని కల్పన…