రవితేజ (Raviteja) హీరోగా నటిస్తోన్న 75వ చిత్రం ‘మాస్ జాతర’ (Mass Jathara). భాను భోగవరపు దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాలో శ్రీలీల (Sreeleela) హీరోయిన్‌గా నటిస్తోంది. సూర్య దేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ ప్రోమో విడుదలైంది. ఈ పాట ఆరంభమే ‘ఇడియట్’ సినిమా స్టెప్పుతో రవితేజ ఆరంభించారు. ‘తు మేరా లవర్’ (TumeraLover) అంటూ సాగే ఈ పాట కేవలం మ్యూజిక్‌ను ప్రోమోగా మేకర్స్ వదిలారు. సినిమాలోని ‘చూపుల్తో గుచ్చి గుచ్చి’ పాట ఐకానిక్ స్టెప్పును రీక్రియేట్ చేసి రవితేజ ఇరగదీశారు. ఈ పాటను రవితేజ, శ్రీలీలపై చిత్రీకరించారు. ఫుల్ పాట 14న విడుదల కానుంది.
అయితే ఇప్పుడు అర్థం కాని విషయం ఏంటంటే.. ‘ఇడియట్’ సాంగ్ ని రీమిక్స్ చేశారా? లేదంటే కేవలం సిగ్నేచర్ స్టెప్పును మాత్రమే తీసుకున్నారా? అనేది తెలియడం లేదు. కేవలం మ్యూజిక్‌తో మాత్రమే ప్రోమో వదిలి మేకర్స్ ఒక సస్పెన్స్‌ను అయితే క్రియేట్ చేశారు. మొత్తానికి మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరీలియో ఓ మాస్ సాంగ్‌ని కంపోజ్ చేసినట్లు అర్థమవుతోంది. ఇందులో రవితేజ పోలీసాఫీసర్ గా కనిపించనున్నారు. అయితే ఈ సినిమాను మే 9న రిలీజ్ చేయనున్నట్లు గతంలో ప్రకటించారు. మరి తాజాగా ‘హరిహర వీరమల్లు’ను అదే రోజున విడుదల చేయనున్నట్టు మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. మరి రవితేజ వెనక్కి తగ్గుతారో లేదంటే అదే రోజున బరిలోకి దిగుతారో చూడాలి. మొత్తానికి పాట ప్రోమోతో రవితేజ ‘మాస్ జాతర’ను షురూ చేసేశారు.
ప్రజావాణి చీదిరాల