టాలీవుడ్‌లో మంచి సక్సెస్ సాధించాక ముద్దుగుమ్మల చూపులన్నీ బాలీవుడ్‌పైనే ఉంటాయి. అక్కడ కూడా సక్సెస్ అయ్యారో ఇక తిరుగుండదు. రెమ్యూనరేషన్ పరంగానే కాకుండా అన్ని విధాలుగా కెరీర్ అద్భుతంగా ఉంటుంది. స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా.. వరుస హిట్స్‌తో నేషనల్ క్రష్‌గా మారింది. ఆ తరువాత బాలీవుడ్‌లో అవకాశాలు అందుకుని అక్కడ కూడా మంచి హిట్స్ కొట్టింది. ‘యానిమల్’, ‘ఛావా’ సినిమాలు అమ్మడికి బిగ్ బ్రేక్ ఇచ్చాయి. కానీ సల్మాన్ ఖాన్‌తో నటించిన ‘సికిందర్’ మాత్రం దెబ్బేసింది. ఈ సినిమాకు రష్మిక హవా ఏమాత్రం పని చేయలేదు. ఇక దీంతో పెద్ద ఎత్తున అమ్మడు ట్రోలింగ్‌ను ఎదుర్కోవాల్సి వస్తోంది.
ఈ ట్రోలింగ్ నుంచి బయటపడాలంటే నెక్ట్స్ మూవీ మంచి హిట్ సాధించాల్సిందే. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఆయుష్మాన్ ఖురానాకు జోడిగా ‘థామ’ అనే చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమా కానీ హిట్ అయితే బాలీవుడ్‌లోనూ అమ్మడి రేంజ్ మారిపోతుంది. బాలీవుడ్ క్వీన్‌గా మారిన ఆశ్చర్యం లేదు. ఒకవేళ ఫ్లాప్ అయ్యిందో కెరీర్ కష్టాల్లో పడుతుంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఊటీలో జరుగుతోంది. హారర్, కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొందుతోంది. ఇప్పటి వరకూ రష్మిక ఈ జానర్‌లో సినిమాలు చేసింది లేదు. సినిమాపై అంచనాలైతే బాగానే ఉన్నాయి. ఈ సినిమా అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read This : ఆ సినిమా కోసం ఎనిమిదేళ్లు..
